అల్లు అర్జున్ తో సినిమా చేస్తాను అని మూడేళ్ళ క్రితమే కమిట్ అయ్యాడు దర్శకుడు కొరటాల శివ. కానీ ఆ సినిమాని మాత్రం చేయలేదు. నిజానికి ఆచార్య చేస్తున్నాడు కాబట్టే.. బన్నీ కూడా కామ్ గా ఉన్నాడు. ఇక ఆచార్య తర్వాత తనతోనే కొరటాల సినిమా చేస్తాడు అనుకున్నాడు బన్నీ. కానీ, కొరటాల మాత్రం బన్నీని పక్కన పెట్టి, ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి సినిమాని ఓకే చేయించుకున్నాడు.
ఆ మాటకొస్తే.. ఎన్టీఆర్ అడగడంతోనే కొరటాల ఎన్టీఆర్ తో సినిమాకి ఫిక్స్ అయ్యాడని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఏది అయితే ఏం ఈ వ్యవహారంలో బన్నీ బాగా హర్ట్ అయ్యాడు. అది తెలుసుకున్న కొరటాల, వెంటనే బన్నీని కలిసి వివరణ ఇచ్చుకున్నాడు. ఎన్టీఆర్ తో సినిమా తర్వాత మీతోనే చేస్తాను అని. పనిలో పనిగా యువసుధ సంస్థ చేత ఆ మధ్య ‘బన్నీ – కొరటాల’ సినిమాకి సంబంధించి కొరటాల ఓ ట్వీట్ కూడా వేయించాడు.
‘బన్నీ-కొరటాల’ సినిమా ఏప్రిల్ 2022 తరువాత వుంటుందని, కొరటాల – బన్నీ కలయికలో పాన్ ఇండియా మూవీ వస్తోందని ఇలా బాగానే హడావిడి చేశారు. అయితే, తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం, కొరటాల – బన్నీ సినిమా మరో రెండేళ్లు పోస్ట్ ఫోన్ అయ్యేలా ఉంది. బన్నీ వచ్చే ఏడాది సమ్మర్ వరకు ఐకాన్ సినిమా మీద ఉంటాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ తో ఒక సినిమా కమిట్ అయ్యాడట.
మరి ఈ లెక్కన వచ్చే ఏడాది బన్నీ, కొరటాల శివతో సినిమా చేయడానికి రెడీగా లేడు. దాంతో మళ్ళీ ఈ కలయిక పై అనుమానాలు పెరిగాయి. అసలు నిజంగా ఈ ప్రాజెక్టు వుంటుందా? కొరటాల పై బన్నీ ఇంకా ఆగ్రహంగానే వున్నారా ?, అందుకే బన్నీ, తన తరువాత ప్రాజెక్టు మీద క్లారిటీతో వున్నారని ఇలా వార్తలు వస్తున్నాయి. ఐకాన్ తర్వాత త్రివిక్రమ్- బన్నీ ప్రాజెక్టు మొదలు అవుతుందట.