Pranay Reddy Vanga: అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ఒక స్టార్ డమ్ ను సంపాదించుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా ఈయన చేసిన సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటూ వస్తున్నాయి. అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో బాలీవుడ్ హీరో అయినా రన్బీర్ కపూర్ ని హీరోగా పెట్టి ఆయన తీసిన అనిమల్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని శాశిస్తుందనే చెప్పాలి ఇప్పటివరకు ఈ సినిమా 860 కోట్ల వసూళ్లను రాబట్టింది.
ఇక దాంతో ఈ సినిమా మీద బాలీవుడ్ సినీ క్రిటిక్స్ అందరూ కూడా విమర్శలు చేస్తున్నారు. దానికి కారణం అనిమల్ సినిమలో కంటెంట్ ఏమీ లేకుండా సినిమాలను తిసి హిట్టు కొడుతున్నాడు అంటూ సందీప్ పైన విమర్శలు చేయడంతో ఆ సినిమాకి అక్కడ కొంచెం నెగిటివ్ టాక్ అయితే స్ప్రెడ్ అవుతుంది. ఇక ఇదే విషయం మీద ఇంతకుముందు సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ బాలీవుడ్ లో ఉన్న కొంత మంది తన సినిమాని తనని తొక్కేయాలని చూస్తున్నారు కానీ తన సినిమాలతోనే వాళ్లకు సమాధానం చెప్తున్నా అంటూ ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు.
ఇక దాంతో సందీప్ రెడ్డి వంగ మీద మరింత విష ప్రచారం చేయడానికి బాలీవుడ్ మీడియా కుట్ర చేస్తుంది. ఇక ఇదే సందర్భంలో సందీప్ వంగ వాళ్ళ అన్నయ్య అయిన ప్రణయ్ రెడ్డి అనిమల్ సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇక ఆయన స్పందిస్తూ తన తమ్ముడు అయిన సందీప్ వంగ సక్సెస్ ని చూసి బాలీవుడ్ ఇండస్ట్రీ జీర్ణించుకోలేక పోతుంది అందువల్లే సందీప్ మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు అంటూ చాలా ఘాటు విమర్శలు చేశాడు.
ఇక ఈ విషయం మీద బాలీవుడ్ మాఫియా ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి అంటూ సోషల్ మీడియాలో పలువురు సందీప్ రెడ్డి వంగ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం ప్రణయ్ రెడ్డి మాట్లాడిన మాటలకి సూపర్ గా మాట్లాడారు అంటూ కామెంట్ చేస్తూనే ఆయన మాట్లాడిన మాటలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు…మొత్తానికి సందీప్ వంగ బాలీవుడ్ మాఫియా కి చెమటలు పట్టిస్తున్నాడు…