Bro Pre Release Business: పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల మల్టీస్టారర్ బ్రో. జులై 28న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. బ్రో చిత్రంలో పవన్ కళ్యాణ్ కేవలం గెస్ట్ రోల్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే తన పాత్ర సినిమాలో 70 శాతానికి పైగా ఉంటుందని పవన్ కళ్యాణ్ ప్రీరిలీజ్ ఈవెంట్లో చెప్పారు. ఈ న్యూస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో జోష్ నింపించింది. రీమేక్ అయినప్పటికీ బ్రో పై అంచనాలు ఏ మాత్రం తగ్గలేదు. అందుకే భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. వరల్డ్ వైడ్ బ్రో దాదాపు వంద కోట్ల బిజినెస్ చేసింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రో చిత్ర థియేట్రికల్ రైట్స్ రూ.80.5 కోట్ల అమ్ముడుపోయాయి. ఇక వరల్డ్ వైడ్ రూ. 97.5 కోట్లకు అమ్మారు. అంటే రూ. 98.5 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ్రో బాక్సాఫీస్ బరిలో దిగుతుంది. ఒక వంద కోట్ల షేర్ రాబడితే బ్రో హిట్ మూవీగా రికార్డులకు ఎక్కుతుంది.
ప్రాంతాల వారీగా చూస్తే… నైజాం రూ. 30, సీడెడ్ రూ. 13.20, ఉత్తరాంధ్ర రూ. 9.5, ఈస్ట్ గోదావరి రూ. 6.40, వెస్ట్ గోదావరి రూ. 5.40, గుంటూరు రూ.7.40, కృష్ణా రూ.5.20, నెల్లూరు రూ.3.40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక రెస్టాఫ్ ఇండియా రూ. 5 కోట్లు, ఓవర్సీస్ రూ. 12 కోట్ల బిజినెస్ చేసింది.
ఇక బ్రో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాగా హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఇద్దరు మెగా హీరోలు నటించడం, త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించడంతో కాంబోపై హైపర్ ఏర్పడింది. బ్రో చిత్రానికి సముద్ర ఖని దర్శకుడు. తమన్నా మ్యూజిక్ అందించారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటించారు. ఊర్వశి రాతెలా స్పెషల్ సాంగ్ చేశారు.