
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు సినీ ఇండస్ట్రీలో ఉన్న పేరు అంతా ఇంతా కాదు. స్టైలిష్‌కు కేరాఫ్ అడ్రస్ అయ్యారు అల్లు అర్జున్. ఇప్పటివరకు లవ్ సినిమాలతో ఆకట్టుకున్న అల్లు అర్జున్.. మొదటిసారి టేకప్ చేసిన పాన్ ఇండియన్ ప్రాజెక్టు ‘పుష్ప’. తన పాన్ ఇండియన్ ఎంట్రీ అదిరిపోయే రేంజ్‌లో ఉండాలని కోరుకుంటున్న బన్నీ ఈ సినిమాకు మాత్రం అనేక అడ్డంకులు ఎదుర్కోక తప్పడం లేదు.
Also Read: తారక్ భీమ్ టీజర్ రికార్డు
తన హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూట్ మొదలైన కొద్ది కాలంలోనే ఎన్నో లీకులు బయటకు వచ్చేశాయి. ఒక్క ఫొటోలే కాకుండా ఆన్ లొకేషన్ వీడియోస్ కూడా బయటకు వచ్చేయడం ఆశ్చర్యకరం. అలా లేటెస్ట్ గా మరో వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తన సినిమాల్లో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్త పడే దర్శకుడు సుకుమార్.
Also Read: దిల్ రాజ్ ఫంక్షన్ కు నందమూరి హీరోలు ఎందుకు రాలేదు?
మరి ఈ సినిమాకు ఇంత సింపుల్‌గా అందులోనూ పాన్ ఇండియన్ లెవల్‌లో ప్లాన్ చేస్తున్న ఈ భారీ చిత్రానికి ఇంత సింపుల్‌గా జాగ్రత్తలు తీసుకోకుండా ఉండడం కాస్త ఆశ్చర్యకర విషయమే అని చెప్పాలి. వాటని కొందరు బన్నీ అభిమానులు కూడా జోరుగా షేర్లు చేసుకుంటున్నారు. మరి ఈ సినిమా విషయంలో దర్శకుడు, నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ వారు అయినా ఇలాంటివి రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారో లేదో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్