https://oktelugu.com/

Balayya: బాలయ్య అన్​స్టాపబుల్​ తర్వాత గెస్ట్​గా బ్రహ్మి డార్లింగ్?

Balayya: నందమూరి బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అఖండ. డిసెంబరు 2న విడుదలకు సిద్ధమైన ఈ సినిమా టీజర్​.. ట్రైలర్​, సాంగ్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఓవైపు సినిమాలతో అలరిస్తూనే.. మరోవైపు, డిజిటల్​ ప్లాట్​ఫామ్​పైనా తన సత్తా చాటుతున్నారు బాలయ్య.  ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదికగా అన్​స్టాపబుల్​ షోలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు బాలయ్య. ఇప్పటికే రెండు ఎపిసోడ్​లు పూర్తి చేసుకున్న ఆయన.. మంచి రెస్పాన్స్​ అందుకున్నారు. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 29, 2021 / 09:26 AM IST
    Follow us on

    Balayya: నందమూరి బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అఖండ. డిసెంబరు 2న విడుదలకు సిద్ధమైన ఈ సినిమా టీజర్​.. ట్రైలర్​, సాంగ్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

    ఓవైపు సినిమాలతో అలరిస్తూనే.. మరోవైపు, డిజిటల్​ ప్లాట్​ఫామ్​పైనా తన సత్తా చాటుతున్నారు బాలయ్య.  ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదికగా అన్​స్టాపబుల్​ షోలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు బాలయ్య. ఇప్పటికే రెండు ఎపిసోడ్​లు పూర్తి చేసుకున్న ఆయన.. మంచి రెస్పాన్స్​ అందుకున్నారు. తొలి ఎపిసోడ్​లో మోహన్​ బాబును గెస్ట్​గా పిలవగా.. రెండో ఎపిసోడ్​లో నేచురల్​ స్టార్ నానిని పిలిపించి షోకు గ్లామర్​ లుక్​ తీసుకొచ్చారు.

    ఇప్పుడు ఇదే అన్​స్టాపబుల్​ జోరుతో మూడో ఎపిసోడ్​కు రెడీ అవుతున్నారు బాలయ్య. అయితే, ఇటీవలే ఆయన భుజానికి సర్జరీ కావడంతో.. షోకు చిన్న బ్రేక్​ తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే కోలుకుని.. షూటింగ్​లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

    షో నెక్ట్ గెస్ట్ ఎవరన్న విషయంపై చర్చలు నడుసున్నాయి. ఈ క్రమంలోనేన నవ్వుల సింహం బ్రహ్మానందం తర్వాత గెస్ట్​గా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. చివరగా జాతిరత్నాలు సినమాలో చిన్న పాత్ర పోషించారు. కాగా, త్వరలోనే పంచతంత్ర, రంగమార్తాండ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఈ షోకు రానున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు బాలయ్య హీరోగా రానున్న అఖండ డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.