Homeఎంటర్టైన్మెంట్Bramhanandam Trailer Review:...

Bramhanandam Trailer Review: కన్న కొడుకును ఏడిపించి ఆ పిచ్చి వదిలించేసిన బ్రహ్మానందం కథ..నవ్వులే నవ్వులు!!

Bramhanandam Trailer Review:  కామెడీ కింగ్ బ్రహ్మానందం(Bramhanandam) ఆయన కొడుకు రాజా గౌతమ్(Raja Gautham) తో కలిసి నటించిన చిత్రం ‘బ్రహ్మ ఆనందం'(Bramhanandam Trailer). చాలా కాలం గ్యాప్ తర్వాత తనయుడు గౌతమ్ ఈసారి మంచి క్వాలిటీ ఉన్న కథతో మన ముందుకు రాబోతున్నాడు. గతంలో గౌతమ్ నటించిన సినిమాల్లో బ్రహ్మానందం కూడా నటించాడు కానీ, ఫుల్ లెంగ్త్ క్యారక్టర్ చేసింది మాత్రం ఈ సినిమాలోనే. బ్రహ్మానందం, గౌతమ్ లతో పాటు ప్రియా వడ్లమనేని, వెన్నెల కిషోర్, ఐశ్వర్య హోలక్కల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ నెల 14 వ తేదీన వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా కాసేపటి క్రితమే రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ఈ మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసాడు. ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఈ ట్రైలర్ ని చూస్తుంన్నంత సేపు ఒక ఫీల్ గుడ్ మూవీ ని చూస్తున్న అనుభూతి కలిగింది. బ్రహ్మానందం మార్క్ కామెడీ టైమింగ్ తో పాటు, హృదయాలకు హత్తుకునే ఎమోషన్స్ కూడా ఈ సినిమాలో ఉన్నాయని ట్రైలర్ ని చూస్తే అర్థం అవుతుంది. తన స్వార్థం కోసం మాత్రమే బ్రతికే ఒక యువకుడి జీవితం లోకి బ్రహ్మానందం రావడం, అతని అవసరం కోసం తన ఆస్తిని తాకట్టు పెడతానని చెప్పడం, ఆ తర్వాత వీళ్ళ మధ్య జరిగిన సందర్భాలను, బావోదేవగలను, ఎంటర్టైన్మెంట్ ని జోడించి డైరెక్టర్ నిఖిల్ ఈ సినిమాని తెరకెక్కించాడు. ట్రైలర్ ని చూసిన వెంటనే కచ్చితంగా ఈ సినిమాలో ఎదో మంచి విషయం ఉంది, పాజిటివ్ టాక్ వస్తే థియేటర్స్ లో చూడాల్సిందే అనే ఫీలింగ్ కలిగింది. బ్రహ్మానందం కూడా రెగ్యులర్ రోల్ లో కాకుండా అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న క్యారక్టర్ ని చేసినట్టుగా అనిపించింది.

ఈమధ్య కాలం లో బ్రహ్మానందం చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు. తన కామెడీ తో పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వించే బ్రహ్మానందం గత ఏడాది ‘రంగమార్తాండ’ సినిమాలో ఎమోషనల్ క్యారక్టర్ చేసి ఆడియన్స్ చేత కంటతడి పెట్టించాడు. మళ్ళీ ఆ తరహా పాత్రలోనే ఆయన కనిపించబోతున్నట్టు ఈ ట్రైలర్ ని చూస్తే అర్థం అవుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని త్వరలోనే హైదరాబాద్ లో చేయనున్నారు, ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ముఖ్య అతిథి గా హాజరు కాబోతున్నాడు. బ్రహ్మానందం కి మెగాస్టార్ చిరంజీవి గురువు లాగ అనే విషయం మన అందరికీ తెలిసిందే. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం చిరంజీవి గారే అని ఎన్నో సందర్భాల్లో ఆయన తెలిపాడు. ఇప్పటి వరకు ఆయన కొడుకు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి చిరంజీవి రాలేదు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఒకసారి వచ్చాడు.

BrahmaAnandam - Official Trailer | Raja Goutham, Brahmanandam, Priya V, Vennela Kishore | RVS Nikhil

Get notified whenever we post something new!

Continue reading

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్ లో రాబోతుందంటే..

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ స్పాన్ సినిమా చేయడం అసాధ్యం. కానీ డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఆ తక్కువ డేట్స్ లోనే ఈ...

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్ అడుగుతున్నాడంటే..

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా హైపర్ ఆది గురించి మాట్లాడుకోవాలి. ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి గా కొనసాగే హైపర్ ఆది , జబర్దస్త్ పై...

Ravi Teja : కూతురుతో కలిసి ‘ఇరుముడి’ కి డబ్బింగ్ చెప్తున్న రవితేజ.. వీడియో వైరల్..

Ravi Teja : వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న 'ఇరుముడి' పై మార్కెట్ లో ఎవ్వరూ ఊహించని రేంజ్ బజ్ ఏర్పడింది. సుబ్రమణ్యస్వామి బ్యాక్ డ్రాప్ లో తీస్తుండడంతో పాటు , రవితేజ తన రొటీన్ మాస్ కమర్షియల్ ఫార్ములా కి భిన్నంగా తీస్తుండడంతో ఆయన అభిమానుల్లోనే కాకుండా,...

Enjoy exclusive access to all of our content

Get an online subscription and you can unlock any article you come across.

Enjoy the benefits of exclusive reading

Exit mobile version