Naresh- Pavitra Lokesh: ఏడాది కాలంగా నరేష్-పవిత్ర లోకేష్ వ్యవహారం హాట్ టాపిక్ గా ఉంది. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఎంట్రీతో పెద్ద హైడ్రామా చోటు చేసుకుంది. అనేక పరిణామాలు జరిగాయి. నరేష్-రమ్య రఘుపతి ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. వీటన్నింటికి మించిన సంచలనం మళ్ళీ పెళ్లి మూవీ. నరేష్, పవిత్ర లోకేష్ తమ వైవాహిక జీవితంలో జరిగిన సంఘటనకు తెర రూపం ఇచ్చారు. చెప్పాలంటే బోల్డ్ గా పబ్లిక్ తమ రహస్యాలు వెల్లడించారు.
అదే సమయంలో తనపై దారుణ ఆరోపణలు చేసిన రమ్య రఘుపతి మీద రివేంజ్ తీర్చుకున్నాడు. రమ్య రఘుపతి క్యారెక్టర్ అత్యంత దారుణంగా మళ్ళీ పెళ్లి మూవీలో చూపించారు. ఆమెను తాగుబోతు, తిరుగుబోతు, డబ్బు పిచ్చి ఉన్న మహిళగా చిత్రీకరించారు. ఇది ముందుగానే ఊహించిన రమ్య రఘుపతి చిత్ర విడుదల అడ్డుకోవాలని చూశారు. అది జరగలేదు. మే 26న మళ్ళీ ప పెళ్లి థియేటర్స్ లో విడుదలైంది.
ఇక మళ్ళీ పెళ్లి చిత్ర ప్రమోషనల్ ఈవెంట్స్ లో నరేష్ కి పవిత్ర లోకేష్ అంటే ఎంత ఇష్టమో తెలియజేశాడు. పెళ్లి చేసుకున్నా చేసుకోకున్నా మాది బలమైన పవిత్ర బంధం అంటున్నారు. మరి అంతగా ప్రేమించే పవిత్ర లోకేష్ తో నరేష్ కి పిల్లల్ని కనే ఆలోచన ఉందా?. ఈ ప్రశ్నపై ఆయన స్వయంగా స్పందించారు. పిల్లల్ని కనడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. పవిత్ర, నేను పిల్లల్ని కనేందుకు శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నాము.
నాకు ఇప్పుడు 60 ఏళ్ళు. ఇప్పుడు పిల్లలు పుడితే వాళ్లకు 20 ఏళ్ళు వచ్చే నాటికి నా వయసు 80. కాబట్టి పిల్లలు కనాల్సిన అవసరం లేదు. నా పిల్లలు, పవిత్ర లోకేష్ పిల్లలు అందరినీ మా పిల్లలుగా పరిగణిస్తాం. మొత్తంగా మాకు ఐదుగురు పిల్లలు ఉన్నారని నరేష్ ఓపెన్ అయ్యారు. పిల్లల్ని కనే ఓపిక ఉంది. అయితే ఈ వయసు కనడం సరికాదని ఆయన పరోక్షంగా చెప్పారు.
నరేష్ కి ముగ్గురు కుమారులు. ఒక్కో భార్యకు ఒక్కో కొడుకు చొప్పున కన్నారు. మూడో కొడుకు తల్లి రమ్య రఘుపతి వద్దే ఉంటున్నాడు. నవీన్ విజయ్ కృష్ణ హీరోగా ఒకటి రెండు చిత్రాలు చేశాడు. ఎప్పటి నుండో పరిశ్రమలోనే ఉంటున్నాడు. ఇంకో కొడుకు ఏదో వృత్తిలో ఉన్నారు ఇక పవిత్ర లోకేష్ భర్త పేరు సుచేంద్రన్. ఒక్క అమ్మాయి, అబ్బాయి సంతానమని సమాచారం. ఈ ఐదుగురు తమ పిల్లలుగా నరేష్ చెప్పుకొచ్చాడు.