Bommarillu Bhaskar: బొమ్మరిల్లు అంటూ ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు భాస్కర్. దాంతో సినిమా పేరే అతని ఇంటి పేరు అయింది. బొమ్మరిల్లు భాస్కర్ గా తెలుగు లోగిళ్ళలో అతని పేరు మారు మ్రోగిపోయింది. అసలు తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఇలా కూడా సినిమా చెయ్యొచ్చా ? అనిపించింది. ఎమోషన్ చాలా సహజంగా ఉంది. అందుకే సినిమా అంత గొప్ప హిట్ అయింది.

ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో పాటు ఎన్నో అవార్డులు రివార్డులు కూడా అందుకుని భాస్కర్ సినీ కెరీర్ కు గొప్ప పునాది అయింది. ఇక ఈ సినిమా విడుదలై 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమా రిలీజ్ కి ముందు అసలు ఎలాంటి అంచనాలు లేవు. కారణం.. అనుభవం లేని దర్శకుడు చేస్తోన్న తొలి సినిమా ఇది, ఇక కేవలం ఒక్క హిట్ మాత్రమే అందుకున్న హీరో సిద్ధార్ చేస్తోన్న రెండో సినిమా ఇది.
ఇక హీరోయిన్ విషయానికి వస్తే.. అసలు తెలుగులో ఏ మాత్రం గుర్తింపు లేని హీరోయిన్ జెనీలియా. అయితే, సినిమా పై కాస్త అయినా బయ్యర్లు ఆసక్తి చూపించడానికి కారణం దిల్ రాజు. రాజు అప్పటికే వరుస విజయాలతో దూసుకుపోతున్న నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అందుకే బొమ్మరిల్లు సినిమా మార్కెట్ మొత్తం రాజును చూసే జరిగింది.
కేవలం 72 ప్రింట్లుతో 130 థియేటర్లలో రిలీజ్ అయింది బొమ్మరిల్లు. రిలీజ్ అయిన మొదటి షో నుంచి.. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఆశించిన స్థాయి కన్నా కలెక్షన్స్ రెట్టింపు వచ్చాయి. తొలి వారంలో ఏకంగా రూ. 5 కోట్ల షేర్ వసూలు చేసింది అంటే.. బొమ్మరిల్లు పై ప్రేక్షకులు ఎంతలా ప్రేమను కురిపించారో అర్ధం చేసుకోవచ్చు.
మొత్తమ్మీద ఈ సినిమా అప్పట్లోనే రూ. 22 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఈ ఎమౌంట్ అప్పట్లో కొందరు స్టార్ హీరోల సినిమాలకు కూడా రాలేదు. ఓవర్సీస్ లో కూడా మూడున్నర కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. సినిమా ఇంత గొప్పగా కలెక్ట్ చేసినా.. ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ అందుకున్న రెమ్యునరేషన్ ఏమి లేదు. నెల జీతానికి పని చేశాడు.
‘ఆరెంజ్’ సినిమాకి కూడా భాస్కర్ కి రెమ్యునరేషన్ ఇవ్వలేదు. కారణం ఓవర్ బడ్జెట్ అని, సినిమా పెద్ద ప్లాప్ అని మొత్తానికి అతనికి ఆ సినిమాతో వచ్చింది ఏమి లేదు. రామ్ తో చేసిన ‘ఒంగోలు గిత్త’ సినిమా కూడా ప్లాపే. ఈ సినిమాకి వచ్చింది ఏమి లేదు. రీసెంట్‌గా అఖిల్‌తో చేసిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా కోసం రెమ్యునరేషన్ అందుకోలేదు. నెలకు రూ. 2 లక్షల రూపాయల జీతం మాత్రమే అందుకున్నాడు. మొత్తానికి బొమ్మరిల్లు భాస్కర్ నాలుగు సినిమా చేసినా అన్నిటికీ మించి హిట్ డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్నా.. రెమ్యునరేషన్ మాత్రం అందుకోలేకపోతున్నాడు.