https://oktelugu.com/

Salman Khan: సల్మాన్ ఖాన్ అట్లీ తో చేస్తున్న సినిమాలో మరోసారి ఆ క్యారెక్టర్ లోనే నటిస్తున్నాడా..?

తెలుగు నుంచి వస్తున్న స్టార్ హీరోలందరూ వాళ్ల మార్కెట్ ను విపరీతంగా పెంచుకుంటూ ముందుకు దూసుకెళ్తుంటే సల్మాన్ ఖాన్ మాత్రం ఇప్పటికీ తన మార్కెట్ ని కోల్పోతూనే వస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పటికే ఆయన మురుగదాస్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటుగా అట్లీ డైరెక్షన్ లో మరొక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

Written By:
  • Gopi
  • , Updated On : July 7, 2024 / 11:45 AM IST

    Salman Khan

    Follow us on

    Salman Khan: బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ని చాలా సంవత్సరాల పాటు ఏకచత్రాధిపత్యంతో ఏలుతున్న హీరోలలో సల్మాన్ ఖాన్ ఒకరు. ప్రస్తుతం ఆయన ప్లాపుల్లో ఉన్నారు. అర్జెంట్ గా ఆయనకి ఒక హిట్ అయితే కావాలి. ఒకప్పుడు ఎంతటి భారీ సక్సెస్ లను సాధించాడో ఇప్పుడు అంతే భారీ ప్లాప్ లను మూట గట్టుకుంటున్నాడు. మరి మొత్తానికైతే ఆయన ఇకమీదట చేయబోయే సినిమాల ద్వారా సక్సెస్ లు దక్కితినే ఆయన మార్కెట్ అనేది పడిపోకుండా ఉంటుంది.

    లేదంటే మాత్రం ఆయన మార్కెట్ కి భారీ ప్రమాదం వాటిల్లే అవకాశం అయితే ఉంది. ఇక తెలుగు నుంచి వస్తున్న స్టార్ హీరోలందరూ వాళ్ల మార్కెట్ ను విపరీతంగా పెంచుకుంటూ ముందుకు దూసుకెళ్తుంటే సల్మాన్ ఖాన్ మాత్రం ఇప్పటికీ తన మార్కెట్ ని కోల్పోతూనే వస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పటికే ఆయన మురుగదాస్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటుగా అట్లీ డైరెక్షన్ లో మరొక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

    అయితే ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ అండర్ కవర్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆయన క్యారెక్టర్ సినిమా మొత్తంలో ఒకటి రెండు సీన్లను మినహాయిస్తే అన్ని సీన్లల్లో తనే కల్పిస్తాడట. అంతటి పవర్ఫుల్ పాత్రలో నటించడానికి సల్మాన్ ఖాన్ రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అంటే సల్మాన్ ఖాన్ కి కొట్టిన పిండి లాంటింది.

    కాబట్టి ఆయన ఆ పాత్ర లో అలవోకగా నటించి మెప్పిస్తాడు. ఇక అదే విధంగా ఈ సినిమాలో ఆయన భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ని కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో తను భారీ కలెక్షన్లను రాబట్టాలని చూస్తున్నాడు. కానీ ఈ సినిమాలు అతనికి సక్సెస్ ని తీసుకొచ్చి పెడతాయా లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక సల్లు భాయ్ మొత్తానికైతే తన కెరియర్ మొత్తాన్ని సౌత్ డైరెక్టర్ల చేతుల్లోనే పెట్టడం విశేషం…