RRR Movie: యుంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కరణ్ అల్లూరి సీత రామరాజు గా, తారక్ కొమరం భీమ్ గా కనిపించనున్నారు. పాన్ ఇండియా లెవెల్లో డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా అజయ్ దేవగణ్, శ్రియా, రాహుల్ రామకృష్ణ, సముద్రఖని, అలీసన్ డూడీ, రే స్టీవెన్‌సన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల తేదీ ఖరారు అయ్యింది అని సమాచారం. డిసెంబర్ తొలి వారంలో ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు ఇటీవల రాజమౌళి వెల్లడించారు. ఇప్పుడు ట్రైలర్ విడుదల తేదీ, వెన్యూ కూడా ఫిక్స్ అయినట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.

Also Read: అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ఆర్‌ఆర్‌ఆర్ మూవీ టీమ్… ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్
ఆర్ఆర్ఆర్ సినిమా ట్రైలర్ ను డిసెంబర్ 3న విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తుందట. థియేటర్లలో విడుదల అయ్యే కొత్త సినిమాల మధ్య ఈ ట్రైలర్ ప్రదర్శించనున్నారు. ముంబైలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఆ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల సల్మాన్‌ను రాజమౌళి కలవడం వెనుక కారణం అదే. ఎన్టీఆర్, రామ్ చరణ్… ఇద్దరూ సల్మాన్‌కు ఇష్టమే. ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు సల్మాన్ రావడానికి రాజమౌళితో పాటు వాళ్లూ ఓ కారణం అనిక్ చెప్పొచ్చు. జనని పాటను అందరి కంటే ముందుగా తెలుగు మీడియాకు చూపించారు రాజమౌళి. ఆ తర్వాత రోజు అన్ని భాషల్లో సాంగ్ విడుదల చేశారు. అదే విధంగా ట్రైలర్‌ను అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. జనవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: యూట్యూబ్ లో ట్రెండ్ క్రియేట్ చేస్తున్న “నాటు నాటు” సాంగ్… 75 మిలియన్ వ్యూస్