Akshay Kumar: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం “పుష్ప” ది రైజ్ పార్ట్ 1. ఇటీవల విడుదలైన ఈ చిత్రం దక్షిణాదితో పాటు హిందీ లోనూ మంచి కలెక్షన్లు రాబడుతోంది. సినిమా విడుదలైన ఫస్ట్ షో నూన్ చే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతూ మూడు రుజుల్లోనే 175 కోట్ల గ్రాస్ కలెక్షన్లను కొల్లగొట్టింది ఈ చిత్రం. ముఖ్యంగా ఈ సినిమాలో బన్నీ నటనకు, సుకుమార్ టేకింగ్‌కు అభిమానులే కాదు సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు. సినీ ప్రముఖులంతా మూవీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

దేవిశ్రీ ప్రసాద్ అందించిన స్వరాలు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. విజయ్‌దేవర్‌కొండ, నితిన్, సందీప్‌రెడ్డి వంగా వంటి సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ‘పుష్ప’ యూనిట్‌కు అభినందనలు తెలియజేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ ఈ సినిమాపై స్పందించాడు. ఈ మేరకు ఆ పోస్ట్ లో ‘అల్లు అర్జున్‌కు శుభాకాంక్షలు. ‘పుష్ప: ది రైజ్’ సినిమాకు దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన వస్తోంది. మన భారతీయ సినిమా ఇండస్ట్రీకి మరో భారీ విజయం దక్కింది. త్వరలోనే ఈ సినిమాను చూస్తాను’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు అక్షయ్.
Also Read: రష్మికను ఆడేసుకుంటున్న నెటిజన్లు.. ఎక్కడ పడితే అక్కడ ఆ పనేనా అంటూ కామెంట్లు
https://twitter.com/akshaykumar/status/1473306324549074946?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1473306324549074946%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fentertainment%2Ftollywood%2Fakshay-kumar-plans-to-watch-allu-arjun-pushpa-and-congratulates-him-for-big-win-601881.html
అంతకు ముందు మరో బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ కూడా బన్నీ నటనను మెచ్చుకుంటూ ‘పుష్ప… ఒక ఎపిక్’ అంటూ పోస్ట్ పెట్టారు. కాగా ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించిగా… స్పెషల్ సాంగ్ లో సమంత స్టెప్పులేసింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్, సునీల్, కన్నడ నటుడు ధనుంజయ, అనసూయ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
Also Read: రియల్ హీరో సోనుసూద్ ఆస్తులు విలువ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!