Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగా ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో బాలీవుడ్ లో ఆ సినిమాని కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి ఒక సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక అక్కడ ఏకంగా 400 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టి మన తెలుగు కథల స్టాండర్డ్ ఏంటో బాలీవుడ్ వాళ్లకు క్లియర్ గా తెలిసేలా చేసింది. ఇక ఈ సినిమాతో షాహిద్ కపూర్ కూడా తన కెరీర్ లో ది బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడు, అలాగే తన కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్లు వసూలు చేసిన సినిమా కూడా ఇదే కావడం విశేషం.
ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా రణ్బీర్ కపూర్ తో చేసిన అనిమల్ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయింది. 900 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టి బాలీవుడ్ లో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇక ఇదిలా ఉంటే అనిమల్ సినిమా సమయంలో కొంతమంది బాలీవుడ్ విమర్శకులు కావాలనే సందీప్ రెడ్డి వంగ మీద విమర్శలు చేస్తూ అనిమల్ సినిమాని డిగ్రేడ్ చేస్తూ మాట్లాడారు. ఇక దానికి సందీప్ కూడా కౌంటర్లు వేశాడు అయినప్పటికీ బాలీవుడ్ మాఫియా సందీప్ మీద కక్ష కట్టిందనే చెప్పాలి.
ఇక సందీప్ సినిమాలను బాలీవుడ్ లో బయ్ కట్ చేయాలని చూస్తున్నట్టు గా తెలుస్తుంది. ఎందుకంటే తను ఎవరితో పడితే వాళ్ళతో దురుసుగా మాట్లాడుతున్నాడు అనే ఒకే ఒక కారణాన్ని సాకుగా చెప్పి తన సినిమాలను బయ్ కట్ చేయాలని చూస్తున్నారు. అయినప్పటికీ సందీప్ సినిమాలు చూడడానికి బాలీవుడ్ ప్రేక్షకులు విపరీతమైన ఉత్సాహాన్ని చూపిస్తుండటం తో బాలీవుడ్ మాఫియా పప్పులు ఏమీ ఉడకడం లేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ అనే సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు…