Bollywood:సినిమా వ్యాపారం కోట్ల టర్నోవర్. పెట్టుబడులు భారీస్థాయిలో ఉంటాయి. ఒక సినిమాకు ఇన్వెస్టెమెంట్ చేస్తే ఆ సినిమా ఫెయిల్ అయినా కనీస లాభాలు ఎటూ పోవు. ఈరోజుల్లో డిటిటల్ హక్కుల ద్వారానైనా పెట్టుబడులను రాబట్టుకోవచ్చు. అయితే బాలీవుడ్లో రాను రాను పరిస్థితి మరీ దిగజారుతోంది. కనీస లాభాలు కాదుగదా.. పెట్టుబడులు కూడా రావడం లేదు. ఒకప్పుడు ఎటువంటి సినిమానైనా ప్రేక్షకులు ఒక్కసారి చూసేందుకు థియేటర్లో క్యూ కట్టేవారు. కానీ ఇప్పుడు ఓటీటీకి అలవాటు అక్కడికి రావడం లేదు. దీంతో థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. దీంతో వసూళ్లు ఊహించని స్థాయికి పడిపోతున్నాయి. అందుకు నిదర్శనం తాజాగా ఓ బాలీవుడ్ సినిమాకు వచ్చిన కలెక్షన్లే. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది..?

బాలీవుడ్ సినిమా అంటే కనీసం 100 కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆ సినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తారు. ఒకప్పుడు 50, 100 రోజుల ఆడాలి అని టార్గెట్ పెట్టుకున్నవాళ్లు.. ఇప్పుడు మొదటి వారం బాగా నడిస్తే చాలనుకుంటున్నారు. ఈ వారంలోనే కమర్షియల్ గా సక్సెస్ సాధించిందా..? లేదా..? అనేది తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు మొదటిరోజు వచ్చిన కలెక్షన్లను భట్టి ఆ సినిమా రేంజ్ ఏంటో తెలిసిపోతుంది. తాజాగా ఓ బాలీవుడ్ సినిమాకు మొదటి రోజు కలెక్షన్లు కేవలం రూ.15 లక్షలు. దేశ వ్యాప్తంగా రిలీజైన ఈ సినిమాకు ఇంత తక్కువ కలెక్షన్లు రావడంతో సినిమా ఇండస్ట్రీ షాక్ కు గురయింది.
బీ టౌన్ ఫేమస్ ప్రొడ్యూసర్లలో భూషన్ కుమార్ ఒకరు. ఈయన నిర్మాణంలో ఈ శుక్రవారం ‘కోడ్ నేమ్ తిరంగా’ అనే సినిమా రిలీజైంది. బెంగాలీ దర్శకుడు దాస్ గుప్తా దీనిని తీశాడు. ఇందులో ప్రముఖ హీరోయిన్ పరిణితి చోప్రా ప్రధానపాత్రలో నటించింది. అంతకుముందు ఇషాక్ జాదే, శుద్ దేశీ రొమాన్స్, గోల్ మాల్ ఆగైనా వంటి సక్సెస్ సినిమాల్లో నటించింది. ఇంత క్యాస్ట్ ఉన్న సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సినిమా ఎలా ఉన్నా కలెక్షన్లపై నమ్మకమైతే ఉంటుంది.
కానీ ఈ సినిమా మొదటిరోజే షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా రిలీజైన ఈమూవీ మొదటిరోజు కలెక్షన్లు కేవలం రూ.15 లక్షలు రాబట్టింది. బాలీవుడ్ లో సినిమా బాగా లేకపోయినా మొదటిరోజు కనీసం కోటికి పైగా దాటుతుంది. కానీ మరీ 15 లక్షలు రావడంపై తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఈ వసూళ్లు సినిమా రిలీజ్ ఖర్చులు, థియేటర్ మెయింటనెన్స్ కూడా సరిపోవని ఆవేదన చెందుతున్నారు.
వాస్తవానికి పరిణితి చోప్రా ఫేమస్ హీరోయిన్ అయినప్పటికీ ఆమె చివరిసారిగా నటించిన ‘సైనా’ కూడా తీవ్ర నిరాశపరిచింది. ఆ సినిమా మొదటిరోజు కలెక్షన్లు రూ.50 లక్షలు. అయినా ఆమెను పెట్టి సినిమా తీయడంతో ప్రేక్షకులు ఒప్పుకోలేకపోయారు. దీనికితోడు ఇప్పుడు బాలీవుడ్లో ఫేవలమైన కథతో సినిమాలు వస్తున్నాయని సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. దీంతో ప్రేక్షకులు ఆదరించడం లేదనే వాదన వినిపిస్తోంది. ‘కోడ్ నేమ్ తిరంగా’ స్పై థ్రిల్లర్ యాక్షన్ మూవీ. అయినా కంటెంట్ బాగా లేకపోవడం సినిమాకు మైనస్ గా మారింది. దీంతో సినిమాను అట్టడుగున నెట్టేశారు.
కరోనా ఎఫెక్ట్ సినిమా రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. అంతకుముందే అందుబాటులోకి వచ్చిన ఓటీటీ కరోనా కాలంలో మరింత విస్తరించింది. దీంతో ప్రేక్షకులు ఓటీటీలకు అలవాటుపడిపోయారు. ఇదే సమయంలో సినిమాల్లో క్వాలిటీ తగ్గిపోతుందనే ప్రచారం సాగుతోంది. ఒక సినిమా కథను మరో సినిమాలోనూ మార్చి చూపించడంపై ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అంతేకాకుండా కేవలం కలెక్షన్ల కోసం సినిమా తీస్తున్నారన్న అపవాదును మూటగట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ పరిస్థితి రాను రాను ఇంకెన్ని మార్పులు చోటు చేసుకుంటోదనన్న చర్చ సాగతోంది.