Homeఎంటర్టైన్మెంట్Bollywood cautious about Sandeep Reddy: సందీప్ రెడ్డి వంగ విషయంలో జాగ్రత్తగా ఉంటున్న బాలీవుడ్...

Bollywood cautious about Sandeep Reddy: సందీప్ రెడ్డి వంగ విషయంలో జాగ్రత్తగా ఉంటున్న బాలీవుడ్ ఇండస్ట్రీ..

Bollywood cautious about Sandeep Reddy: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ…’అనిమల్’ సినిమాతో తనదైన రీతిలో సత్తా చాటుకున్న ఈ దర్శకుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేశాడనే చెప్పాలి. బాలీవుడ్ మాఫియా ఆయన సినిమాను తొక్కెయాలనే ప్రయత్నం చేసింది. కానీ ఆయన కౌంటర్లను ఇస్తూ తన సినిమాని సక్సెస్ఫుల్ దిశగా ముందుకు తీసుకెళ్లాడు. ఈ సినిమా 900 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది అంటే మామూలు విషయం కాదు. మొత్తానికైతే సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ మాఫియాను ఒక్కడే ఒంటరిగా ఎదుర్కొన్నాడు. వారికి కౌంటర్లను ఇస్తూ ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లను పెడుతూ సినిమాని సక్సెస్ ఫుల్ గా ఎలా మార్చుకోవాలి అనేది కూడా తనే స్వయంగా చేసి చూపించాడు. ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డివంగకి చాలా ఘట్స్ ఉంటాయనే విషయం మనందరికి తెలిసిందే. ఇక బాలీవుడ్ మాఫియా సందీప్ రెడ్డి వంగ తో పెట్టుకోవడం కంటే అతనితో మనం జాగ్రత్తగా ఉంటే మంచిది అని అనుకుంటున్నాట్టుగా తెలుస్తుంది.

ఇక ఏదేమైనా ఇప్పుడు తన నుంచి రాబోతున్న స్పిరిట్ సినిమా విషయంలో కూడా ఆయన అదే కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాతో ఎలాగైనా సరే గొప్ప విజయాన్ని సాధించి తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో సందీప్ రెడ్డివంగా ఉన్నాడు.

ఈ మూవీ అన్ని రికార్డు లను బ్రేక్ చేసి టాప్ లెవల్లో ముందుకు దూసుకెళ్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. మొత్తానికైతే ఆయన ఈ సినిమాతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయాలనుకున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాని సైతం టాప్ లెవల్లో నిలుపడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు…

ప్రభాస్ కెరియర్ లోనే ఇదొక డిఫరెంట్ సినిమాగా మిగులుతుందంటు సందీప్ తన సన్నిహితుల దగ్గర చెబుతున్నారట. ఇక ఏది ఏమైనా కూడా సందీప్ అనుకున్నది అనుకున్నట్టుగా చేయగలిగితే మాత్రం ఈ సినిమాతో 3000 కోట్ల వరకు కలెక్షన్స్ ను ఈజీగా వసూలు చేస్తారని మరి కొంతమంది కామెంట్స్ చేస్తుండటం విశేషం…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version