
Bollywood hero Ishaan Khattar: బాలనటుడిగా ఎన్నో సూపర్ హిట్ బాలీవుడ్ సినిమాల్లో నటించి, ఇప్పుడు యువ హీరో గా బాలీవుడ్ లో గొప్పగా రాణిస్తున్న నటుడు ఇషాన్ ఖాతర్.ఇతను సౌత్ సినిమాల్లో పెద్దగా నటించలేదు కానీ,ఒక విలక్షణ నటుడిగా ఇక్కడి నెటిజెన్స్ కి ముఖ పరిచయం ఉన్న సెలబ్రిటీనే.
చూసేందుకు హాలీవుడ్ యాక్షన్ హీరోలాగా అనిపిస్తున్న ఇషాన్ ఖాతర్ కి ఇప్పుడు హాలీవుడ్ లో కూడా వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.’డోంట్ లుక్ అప్’ అనే ఆంగ్ల చిత్రం లో చిన్న పాత్ర పోషించిన ఇషాన్ కి ఇప్పుడు ‘ది పర్ఫెక్ట్ కపుల్’ అనే నవలని ఆధారంగా తీసుకొని ఇంగ్లీష్ లో తెరకెక్కిస్తున్న ఒక వెబ్ సిరీస్ లో కీలక పాత్ర పోషించే అవకాశం దక్కింది. ఈ సిరీస్ లో ప్రముఖ హాలీవుడ్ నటులు నిఖోల్ కిడ్ మ్యాన్ మరియు లీవ్ స్కరీభర్ కూడా నటిస్తున్నారు.
వచ్చే వారం నుండే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్లనుంది.ఇక ఇషాన్ నటించిన లేటెస్ట్ బాలీవుడ్ చిత్రం పీపా.ఇందులో ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది.1971 వ సంవత్సరం లో ఇండియా – పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం వల్ల గరీబ్ పూర్ అనే గ్రామం లో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలను ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
అయితే వివాదాలకు కేంద్ర బిందువుగా నిల్చిన ఈ సినిమా ని థియేటర్స్ లో విడుదల చేయడానికి మల్టిప్లెక్స్ ఓనర్లు ఒప్పుకోవడం లేదు.దాంతో ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీ లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఇషాన్ ఖాతర్ చివరిసారిగా వెండితెర మీద కనిపించిన చిత్రం ‘ఫోన్ భూత్’. ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది, బాక్స్ ఆఫీస్ వసూళ్ల పరంగా యావరేజి అని అనిపించుకుంది.