Homeఎంటర్టైన్మెంట్Bollywood: మూడుముళ్ళ బంధంతో ఒక్కటైన మరో బాలీవుడ్ జంట...

Bollywood: మూడుముళ్ళ బంధంతో ఒక్కటైన మరో బాలీవుడ్ జంట…

Bollywood: మూడేళ్ల ప్రేమబంధాన్ని మూడుముళ్ల బంధంగా మార్చుకున్నారు బాలీవుడ్‌ నటులు అంకితా లోఖండే- విక్కీజైన్. ‘మణికర్ణిక’, ‘భాఘీ’ సినిమాల్లో మెరిసిన అంకిత అంతకుముందు పలు బాలీవుడ్‌ సీరియళ్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా దివంగత నటుడు సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌తో కలిసి ఆమె నటించిన ‘పవిత్ర రిష్తా’ ధారావాహిక బాలీవుడ్‌ బుల్లితెరపై ఓ సంచలనం. ఈ సీరియల్‌ చిత్రీకరణ సమయంలోనే సుశాంత్‌- అంకితలు ప్రేమలో పడ్డారు. సుమారు ఆరేళ్లపాటు ఈ ప్రేమ బంధం కొనసాగింది. అయితే ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో ఇద్దరూ విడిపోయారు. ఈనేపథ్యంలోనే గత ఏడాది సుశాంత్‌ ఆత్మహత్య సమయంలో అంకితా పేరు కూడా బాగా వినిపించింది. ఇక సుశాంత్‌ బ్రేకప్‌ తర్వాత మరో బాలీవుడ్‌ నటుడు విక్కీజైన్‌తో ప్రేమలో పడింది అంకిత.

Bollywood
bollywood actress ankitha lokhande marriage with vicky jain

Also Read: ఎట్టకేలకు నెరవేరనున్న పునీత్ సంకల్పం.. మ్యూజియంగా తండ్రి నివసించిన పూరిల్లు

తాజాగా తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పెద్దల అనుమతితో పెళ్లిపీటలెక్కారు. అంతకుముందు ప్రి వెడ్డింగ్‌ కార్యక్రమాలు కూడా వేడుకగా జరిగాయి. ముంబయిలోని గ్రాండ్‌ హయత్ హోటల్‌ వేదికగా ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఏడడుగులు నడిచారు. ఈ సందర్భంగా నూతన వధూవరులిద్దరూ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. పెళ్లికూతురు అంకిత గోల్డెన్‌ కలర్‌ లెహెంగాలో ముస్తాబవగా, వరుడు విక్కీ కూడా వధువుకు మ్యాచ్‌ అయ్యేలా బంగారు- తెలుపు రంగు షేర్వాణీలో రెడీ అయ్యాడు. సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ వధూవరులిద్దూ పెళ్లి మండపం వద్దకు వింటేజ్‌ కారులో రావడం విశేషం. కరోనా నిబంధనల నేపథ్యంలో కొద్దిమంది సినీ ప్రముఖులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ప్రస్తుతం అంకితా – విక్కీల గ్రాండ్‌ వెడ్డింగ్‌కు సంబంధించిన పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈక్రమంలో పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు నూతన వధూవరులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.

Also Read: విక్కీకోసం పంజాబీ నేర్చుకున్న కత్రినా.. ఎందుకో తెలుసా?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular