Govinda Divorce: సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం ఇటీవల కాలంలో సర్వసాధారణంగా మారిపోయింది. ఉన్నన్ని రోజులు కలిసి ఉండటం.. కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం.. ఆ తర్వాత ఉన్నట్టుండి సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు అన్ఫాల్లో చేసుకోవడం.. ఆ తర్వాత భరణాలు ఇవ్వడం ఇటీవల కామన్ గా మారిపోయింది. విడిపోయిన వెంటనే..ఇంకో మహిళ/ పురుషుడు తో కలిసి ఉండటం.. కలిసి కనిపించడం స్టేటస్ సింబల్ గా రూపాంతరం చెందింది.
Also Read: రాజశేఖర్, శంకర్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా అదేనా..? చేసుంటే పాన్ ఇండియన్ స్టార్ హీరో అయ్యేవాడు!
హృతిక్ రోషన్ – సుజానే, మలైకా అరోరా- అర్బాజ్ ఖాన్, వీరేంద్ర సెహ్వాగ్ – ఆర్తి, హార్దిక్ పాండ్యా – నటాషా, యజువేంద్ర చాహల్ – ధనశ్రీ.. ఇటీవల కాలంలో విడాకులు తీసుకున్న సెలబ్రిటీ జంటలు వీరు. సహజంగా మన దేశంలో బాలీవుడ్ నటులు, క్రికెటర్లకు ఎక్కువ రీచ్ ఉంటుంది. అందువల్లే వీరి విడాకుల వ్యవహారం మీడియాలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల విడాకులు తీసుకున్న చాహల్ తన భార్యకు భరణంగా 60 కోట్లు చెల్లించినట్టు తెలుస్తోంది.. అయితే దీనిపై చాహల్ ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు విడాకులు తీసుకుంటున్న జంటలో బాలీవుడ్ నటుడు గోవిందా ఆయన భార్య సునీత చేరారని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వారిద్దరు వేరువేరుగా ఉంటున్నారని.. విడాకులు తీసుకోవడం వల్లే ఎవరిదారులు వాళ్ళు చూసుకున్నారని నేషనల్ మీడియా కోడై కూస్తోంది. సోషల్ మీడియాలో, మీడియాలో విడాకుల వార్తలు ప్రముఖంగా వస్తున్న నేపథ్యంలో గోవింద భార్య సునీత స్పందించక తప్పలేదు.
అందువల్లేనట..
చాలా సంవత్సరాల వరకు బాలీవుడ్లో హాస్యనటుడిగా, కథానాయకుడిగా మెప్పించారు గోవిందా. గోల్ మాల్ సిరీస్ లో తనదైన కామెడీతో అలరించారు. ఇక ఇటీవల కాలంలో గోవిందా రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన రాజకీయ నాయకుడిగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. రాజకీయ నాయకుడు కావడంతో గోవిందా గృహం కార్యకర్తలతో నిత్యం సందడిగా ఉంటుంది. అందువల్ల గోవిందా తన మకాం వేరే అపార్ట్మెంట్ కు మార్చారని ఆయన భార్య సునీత అంటున్నారు. ” గోవింద ఒకప్పుడు నటుడు. ఇప్పుడు ఆయన రాజకీయ నాయకుడు. ప్రతిరోజు మా ఇంటికి వందల మంది కార్యకర్తలు వస్తుంటారు. మేము ఇంట్లో ఉన్నప్పుడు షార్ట్స్ వేసుకుని తిరుగుతూ ఉంటాం. దానివల్ల ఆయనకు ఇబ్బందిగా ఉంది. మా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉంది. అందువల్లే ఆయన తన మకాం వేరే అపార్ట్మెంట్ కు మార్చారు. దీనిని కొంతమంది వేరే విధంగా చూస్తున్నారు. గోవిందా విడాకులు తీసుకున్నారని నిరాధారమైన వార్తలను ప్రసారం చేయడం మొదలుపెట్టారు. ఇవన్నీ చూసి చూసి విసుగు అనిపించింది. అందువల్లే సరైన సమాధానం చెప్పాలని ఇలా స్పష్టత ఇవ్వాల్సి వస్తోందని” సునీత వ్యాఖ్యానించారు. దీంతో గోవింద – సునీత విడాకులు ఉత్తివేనని తేలిపోయింది. మరోవైపు నిప్పు లేనిదే పొగరాదని.. అందువల్లే ఇలాంటి వార్తలు వస్తున్నాయని మరికొందరు అంటున్నారు.
Also Read: నా తమ్ముడి ఇంటి జనరేటర్ లో పంచదార పోయడానికి కారణం అదే : మంచు విష్ణు