Bheemla Nayak US Record: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని అతి తక్కువ టికెట్ రేట్స్ మీద కూడా వంద కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టి సరికొత్త ప్రభంజనం సృష్టించింది..మొదటి వారం ప్రతి ప్రాంతం లో ఈ సినిమాకి తెగిన టిక్కెట్లు బాహుబలి పార్ట్ 2 కి కూడా తెగలేదు అని ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోయారు..విడుదల అయ్యి ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటికి ఈ సినిమా కి సంబంధించిన కొన్ని రికార్డ్స్ ని పాన్ ఇండియా సినిమాలు సైతం బ్రేక్ చేయలేకపోయాయి..అలాంటి రికార్డ్స్ లో ఒక్కటే భీమ్లా నాయక్ ఓవర్సీస్ గ్రాస్ రికార్డు..ఒక్క #RRR సినిమా మినహా ఇటీవల విడుదల అయినా ఏ పాన్ ఇండియా సినిమా కూడా భీమ్లా రికార్డు ని ముట్టుకోలేకపోయింది.

ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమా ప్రీమియర్స్ నుండే దాదాపుగా 9 లక్షల డాలర్లు వసూలు చేసింది..దీని తర్వాత వచ్చిన పెద్ద సినిమాలలో ఒక్క #RRR సినిమా మినహా ఏ సినిమా కూడా భీమ్లా నాయక్ సృష్టించిన ఈ అరుదైన రికార్డుని బ్రేక్ చెయ్యలేకపోయింది..ఇటీవల వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా కూడా ఈ రికార్డు కి దరిదాపుల్లో రాలేకపోయింది..ఇక అమెరికా లో మొదటి వారం వసూళ్ళలో కూడా భీమ్లా నాయక్ హవాని ఏ సినిమా కూడా మ్యాచ్ చెయ్యలేకపోయింది,అమెరికాలో ఇటీవల విడుదల అయినా సినిమాలలో టాప్ 6 ఏవో ఒక్కసారి పరిశీలిస్తే #RRR మూవీ మొదటి వారం లో అక్షరాల 68 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి టాప్ 1 గా నిలవగా..భీమ్లా నాయక్ చిత్రం 18 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి టాప్ 2 గా నిలిచింది.

Also Read: Megastar Chiranjeevi: శ్రీదేవితో అలా చేసి.. 15 రోజులు హాస్పిటల్‌లో జాయిన్ అయ్యా – చిరంజీవి
ఇక దేశ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ ని ఒక్క రేంజ్ లో ఊపిన KGF చాప్టర్ 2 సినిమా USA బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి వారం లో 15 కోట్ల 77 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి టాప్ 3 స్థానం లో నిలబడగా..అల్లు అర్జున్ పుష్ప సినిమా 15 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి నాల్గవ స్థానం లోను అలాగే 13 కోట్ల 83 లక్షల రూపాయిల గ్రాస్ వసూలు చేసి ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా ఐదవ స్థానం లోను నిలిచాయి..ఇక గత ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద చెలరేగిపోయిన నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా 6 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి ఆరవ స్థానం లో కొనసాగుతుంది..భీమ్లా నాయక్ తర్వాత వచ్చిన రెండు పాన్ ఇండియన్ సినిమాలు భీమ్లా మొదటి వారం వసూళ్లను అందుకోలేకపోయింది..ఇక లేటెస్ట్ గా వచ్చిన ఆచార్య సినిమా కూడా భీమ్లా నాయక్ రికార్డు ని అందుకోవడం ప్రస్తుతానికి అసాధ్యం అని USA బాక్స్ ఆఫీస్ వర్గాలు చెప్తున్నాయి, అలా పవన్ కళ్యాణ్ కేవలం ఒక్క OTT సినిమాని రీమేక్ చేసి ఈ స్థాయి ప్రభంజనం సృష్టించడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం.

Also Read: F3 Movie: ‘బ్లాస్టింగ్’ అట.. ఇంతకీ ఏమిటి ఆ బ్లాస్టింగ్ ?
Recommended Videos
[…] Dil Raju vs Warangal Srinu: ‘తాడిని తన్నే వాడుంటే.. వాడి తలను తన్నే వాడు మరొకడుంటాడు’ అనే సామెత ప్రస్తుతం టాలీవుడ్ లో వరంగల్ శ్రీనుకి బాగా సూట్ అయ్యేలా ఉంది. అనామకుడిగా ఇండస్ట్రీకి వచ్చి.. పెద్ద సినిమాల దగ్గర నుంచి చిన్నాచితకా సినిమాల వరకూ ఏ సినిమాని వదలడం లేదు. ముఖ్యంగా నైజాం అంటే.. వరంగల్ శ్రీను అడ్డా అంటున్నాడు. […]