VJ Sunny Injured: పొరపాటున బిగ్ బాస్ సన్నీని షూట్ చేసిన సప్తగిరి… హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు!

వీజే సన్నీ కెరీర్ పరిశీలిస్తే గతంలో పలు సీరియల్స్ లో నటించాడు. బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న సన్నీ టైటిల్ విన్నర్ అయ్యాడు. ఫైనల్ లో షణ్ముఖ్ జస్వంత్-సన్నీ పోటీపడ్డారు. ప్రేక్షకుల ఓట్లతో వీజే సన్నీ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఆ షోతో పాపులారిటీ తెచ్చుకున్న సన్నీ సినిమాలు, వెబ్ సిరీస్లు చేస్తున్నారు. ఆయనకు సోలో హీరోగా ఆఫర్స్ వస్తున్నాయి.

Written By: Shiva, Updated On : May 12, 2023 6:45 pm

VJ Sunny Injured

Follow us on

VJ Sunny Injured: షూటింగ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. నటుడు సప్తగిరి పొరపాటున బిగ్ బాస్ ఫేమ్ వీజే సన్నీని షూట్ చేశాడు. బుల్లెట్ అతి దగ్గరగా తగలడంతో అతడు గాయాలపాలయ్యాడు. విషయంలోకి వెళితే… వీజే సన్నీ, సప్తగిరి ప్రధాన పాత్రల్లో అన్ స్టాపబుల్ టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కింది. ఈ మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది. ఆల్రెడీ టీజర్ విడుదల చేశారు. చిత్ర ప్రమోషన్స్ కోసం ఓ ప్రోమో షూట్ చేస్తున్నారు. సప్తగిరి, వీజే సన్నీ, 30 ఇయర్స్ పృథ్విలపై ప్రోమో షూట్ చేస్తున్నారు. పోలీస్ గెటప్ లో ఉన్న సప్తగిరి… పక్కనే ఉన్న సన్నీ మీద రివాల్వర్ ఎక్కుపెట్టాడు.

అది పొరపాటున పేలింది. చాలా క్లోజ్ లో ఉన్న సన్నీకి బుల్లెట్ తగిలింది. అది డమ్మీ బుల్లెట్ అయినప్పటికీ తక్కువ దూరం నుండి తాకడంతో ఆయనకు గాయమైంది. వెంటనే చిత్ర యూనిట్ సభ్యులు దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లారు. సన్నీ కండీషన్ పై సమాచారం అందాల్సి ఉంది. అన్ స్టాపబుల్ మూవీలో పలువురు టాలీవుడ్ కమెడియన్స్ నటిస్తున్నారు. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ ప్రమాదం నాటకం కూడా కావొచ్చని ఒక అంచనా. ఇటీవల ఫ్రాంక్ వీడియోలు చేసి సినిమాలకు ప్రమోషన్స్ తెచ్చుకోవడం ట్రెండ్ గా మారింది. చిన్న హీరోలు దీన్ని ఫాలో అవుతున్నారు. ఇటీవల అల్లరి నరేష్ ఏకంగా స్టార్ యాంకర్ సుమ మీదే ఫ్రాంక్ చేశారు. ఉగ్రం మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా సుమను అరెస్ట్ చేసినట్లు ఫోటోలు విడుదల చేశారు. అవి సంచలనం రేపాయి. తీరా ఫ్రాంక్ అని తెలుసుకొని ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. విజే సన్నీ తన ‘ఏటీఎం’ సిరీస్ ప్రమోషన్ కోసం ఏటీఎం చోరీ చేసి పారిపోతున్నట్లు సీసీ టీవీ ఫుటేజ్ విడుదల చేశారు.

ఇక వీజే సన్నీ కెరీర్ పరిశీలిస్తే గతంలో పలు సీరియల్స్ లో నటించాడు. బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న సన్నీ టైటిల్ విన్నర్ అయ్యాడు. ఫైనల్ లో షణ్ముఖ్ జస్వంత్-సన్నీ పోటీపడ్డారు. ప్రేక్షకుల ఓట్లతో వీజే సన్నీ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఆ షోతో పాపులారిటీ తెచ్చుకున్న సన్నీ సినిమాలు, వెబ్ సిరీస్లు చేస్తున్నారు. ఆయనకు సోలో హీరోగా ఆఫర్స్ వస్తున్నాయి.