Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ అరెస్ట్ ఆయన ఫ్యాన్స్ ని షాక్ కి గురి చేసింది. బుధవారం రాత్రి స్వగ్రామంలో పల్లవి ప్రశాంత్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. పల్లవి ప్రశాంత్ పోలీసులకు సహకరించారు. పల్లవి ప్రశాంత్ తమ్ముడిని కూడా అరెస్ట్ చేశారు. దాదాపు ఆరు గంటల పాటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో పల్లవి ప్రశాంత్ ని విచారించారు. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా… 14 రోజుల రిమాండ్ విధించారు. చంచల్ గూడ జైల్లో ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ ఉన్నాడు.
అయితే పల్లవి ప్రశాంత్ ని బయటకు తీసుకొచ్చేందుకు లాయర్లు ప్రయత్నం చేస్తున్నారు. పల్లవి ప్రశాంత్ కి బెయిల్ ఇవ్వాలంటూ నాంపల్లి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. నేడు మధ్యాహ్నం పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. బెయిల్ పిటీషన్ తోసిపుచ్చిన నేపథ్యంలో ప్రశాంత్ రిమాండ్ పూర్తి అయ్యే వరకు బయటకు రాలేడు.
Also Read: డంకి మూవీ ఫుల్ రివ్యూ
పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై మాజీ కంటెస్టెంట్స్ కొందరు స్పందించారు. భోలే షావలి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్లడం జరిగింది. పల్లవి ప్రశాంత్ త్వరగా బయటకు రావాలని కోరుకోండని అన్నారు. అత్యుత్సాహంలో జరిగిన పొరపాట్లు తప్పితే లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేస్తున్నట్లు పల్లవి ప్రశాంత్ కి కూడా తెలియదని భోలే అన్నారు. కష్టపడి టైటిల్ గెలిచాడని వాపోయాడు.
అశ్వినీ శ్రీ సైతం స్పందించింది. పల్లవి ప్రశాంత్ చాలా మంచివాడు. అరెస్ట్ చేయడం దారుణం. దయచేసి పల్లవి ప్రశాంత్ ని బయటకు తీసుకురండని ఆమె వేడుకున్నారు. డిసెంబర్ 17న బిగ్ బాస్ తెలుగు 7 ముగిసింది. పెద్ద ఎత్తున అన్నపూర్ణ స్టూడియోకి చేరుకున్న అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ హంగామా చేశారు. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ తో పాటు అభిమానుల మీద కేసులు నమోదు చేశారు.
Also Read: సలార్ లో కెజిఎఫ్ రాఖీ భాయ్… ట్రైలర్ లో అలా హింట్ ఇచ్చిన డైరెక్టర్!