Pallavi Prashanth Arrest : అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పల్లవి ప్రశాంత్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. డిసెంబర్ 17 ఆదివారం బిగ్ బాస్ తెలుగు 7 ఫినాలే ముగిసింది. పల్లవి ప్రశాంత్ విన్నర్ అని ఒక రోజు ముందే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ భారీగా అన్నపూర్ణ స్టూడియోకి చేరుకున్నారు. ఈ క్రమంలో ప్రశాంత్ ఫ్యాన్స్ ఉత్సాహం శృతి మించింది. అమర్ దీప్ కారుపై దాడి చేశారు. కారు అద్దాలు పగలగొట్టారు.
అమర్ దీప్-ప్రశాంత్ ఫ్యాన్స్ కోట్లాటకు దిగారు. ఆర్సీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు మీద దాడి చేశారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ఉందని తెలిసి అన్నపూర్ణ స్టూడియో లోపలికి పోయిన పోలీసులు, ప్రశాంత్ కి సిట్యుయేషన్ వివరించి బ్యాక్ డోర్ నుండి ఇంటికి పంపారు. అయితే పల్లవి ప్రశాంత్ పోలీసుల సూచనలు పక్కనపెట్టి ఓపెన్ టాప్ కారులో అన్నపూర్ణ స్టూడియోకి వచ్చారు. దీంతో పల్లవి ప్రశాంత్ కి పోలీసులు గట్టి వార్నింగ్ ఇచ్చారు. పల్లవి ప్రశాంత్ ర్యాలీ నిర్వహించారు.
పల్లవి ప్రశాంత్ తీరుపై మండిపడ్డ పోలీసులు పలు సెక్షన్స్ క్రింద కేసు నమోదు చేశారు. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ తప్పదని వార్తలు వచ్చాయి. ఇక నేడు ఉదయం నుండి పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మధ్యాహ్నం తర్వాత అజ్ఞాతం నుండి బయటకు వచ్చిన పల్లవి ప్రశాంత్ నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఇంట్లోనే ఉన్నాను. కొందరు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. నేను ఫోన్ స్విచ్ఛాఫ్ చేయలేదు. అసలు ఫోన్ వాడటం లేదని వివరణ ఇచ్చాడు.
Evado car lu bus lu pagala dengithe #PallaviPrasanth yemi chesadu raa
Arrest cheydam anedi chala tappu asalu
Idhe political leader pedda heros saballo rally lo chala jarugutai vallani touch chese dammu unda miku asalu pic.twitter.com/wtlbUdkPoq— Hemu Paruchuri (@HemuParuchuri) December 20, 2023
అయితే నేడు సాయంత్రం పోలీసులు పల్లవి ప్రశాంత్ ని అదుపులోకి తీసుకున్నారు. తాను ఏ తప్పు చేయలేదని ప్రశాంత్ నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. పోలీసులు మాతో రావాల్సిందే అని పట్టుబట్టడంతో సహకరించాడు. కాసేపు వాగ్వాదం నడిచింది. పల్లవి ప్రశాంత్ తో పాటు ఆయన సోదరుడు మహవీర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. కాగా పల్లవి ప్రశాంత్ కి బెయిల్ కోసం హైకోర్ట్ న్యాయవాది కే రాజేష్ కుమార్ ప్రయత్నం చేశారు. పోలీసులు ఎఫ్ ఐ ఆర్ కాపీ ఇవ్వడం లేదని, అది లేకుండా బెయిల్ రాదని ఆయన ఆరోపణ చేశారు.
#Exclusivevisuals regarding #Pallaviprashantharrest#Bigboss7telugu winner #pallaviprashanth arrest visuals pic.twitter.com/RUajDA56PW
— SHRA.1 JOURNALIST✍ (@shravanreporter) December 20, 2023
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Bigg boss winner pallavi prashanth arrest
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com