https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: 50 లక్షలు అని చెప్పి విన్నర్ కి ఇచ్చేది అంతేనా… పాపం ఉసూరుమనిపించారుగా!

మొదట్లో బిగ్ బాస్ విన్నర్ కు వచ్చిన 50 లక్షల ప్రైజ్ మనీ లో 13 లక్షలు టాక్స్ రూపంలో పోగా .. దాదాపు రూ. 37 లక్షలు మిగిలేవి. కాగా జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ టాక్స్ తో పాటు జిఎస్టీ కూడా తోడైంది.

Written By:
  • NARESH
  • , Updated On : December 17, 2023 / 06:35 PM IST

    Bigg Boss 7 Telugu

    Follow us on

    Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ప్రైజ్ మనీ 50 లక్షలు. గెలిచిన వారికి ఆ అమౌంట్ ఇస్తామని హోస్ట్ నాగార్జునతో పాటు నిర్వాహకులు హంగామా చేస్తారు. ఆడియన్స్ ని ఆ ఫిగర్ టెంప్ట్ చేస్తుంది.ఆ యాభై లక్షల కోసమే కంటెస్టెంట్స్ 15 వారాలు చెమటోడుస్తారు. కానీ వాస్తవానికి ఆ యాభై లక్షల్లో విన్నర్ చేతికి వచ్చేది రూ. 23 లక్షలు మాత్రమే. మిగిలిన 27 లక్షలు టాక్స్ అండ్ జీఎస్టీ రూపంలో కట్ అయిపోతుంది. అవి మినహాయించుకుని 23 లక్షలు విన్నర్ కి ఇస్తారు.

    మొదట్లో బిగ్ బాస్ విన్నర్ కు వచ్చిన 50 లక్షల ప్రైజ్ మనీ లో 13 లక్షలు టాక్స్ రూపంలో పోగా .. దాదాపు రూ. 37 లక్షలు మిగిలేవి. కాగా జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ టాక్స్ తో పాటు జిఎస్టీ కూడా తోడైంది. దీంతో బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ లో భారీగా కోత జరుగుతుంది. ఈ విషయాన్ని ఇటీవల బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ విజే సన్నీ కూడా స్పష్టం చేసాడు. 50 లక్షలు గెలుచుకున్నది వాస్తవమే అయినా తన చేతికి వచ్చింది మాత్రం 23 లక్షలే అని చెప్పాడు.

    అయితే సీజన్ 7 లో ట్విస్ట్ ఏంటంటే .. యావర్ రూ . 15 లక్షలు తీసుకుని రేసు నుండి తప్పుకున్నాడు. ఈ రూ . 15 లక్షలు విన్నర్ కి ఇచ్చే ప్రైజ్ మనీ నుండి కట్ చేస్తారు. ఆ లెక్కన చూసుకుంటే .. మిగిలేది రూ. 35 లక్షలు. అందులో 46 శాతం టాక్స్ టాక్స్ కట్టింగ్స్ కి పోను మిగిలేది రూ. 16 లక్షలు మాత్రమేనట .

    బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అని గట్టిగా వినిపిస్తోంది. ఈ క్రమంలో టైటిల్ గెలిచిన ప్రశాంత్ కి దక్కేది కేవలం రూ. 16 లక్షలేనట. రెమ్యునరేషన్ ప్రతి ఒక్కరికి సెపరేట్ గా ఇస్తారు. తనకు వచ్చిన ప్రైజ్ మనీ ని రైతుల కోసం ఉపయోగిస్తానని ప్రశాంత్ చెప్పాడు. కష్టంలో ఉన్న రైతుని ఆదుకుంటాను. కోట్లాదిమందికి నేను ఆదర్శంగా నిలుస్తానని అని అన్నాడు ప్రశాంత్. ఎంత వచ్చినా మాట ప్రకారం ఆ డబ్బును ప్రశాంత్ పేద రైతులకే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.