Bigg Boss Telugu 9 Latest Updates: ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) కాన్సెప్ట్ సామాన్యులు మరియు సినీ సెలబ్రిటీల మధ్య కొట్లాట అనే విధంగా ఉంటుందని మన అందరికీ తెలిసిందే. ప్రోమోలను చూస్తేనే ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. భవిష్యత్తులో బిగ్ బాస్ వీళ్ళ మధ్య తారా స్థాయికి చేరే గొడవలు పెట్టేస్తాడు, భీభత్సమైన కంటెంట్ రాబట్టుకుంటాడు అని మనమంతా అనుకున్నాం. కానీ మొదటి ఎపిసోడ్ నుండే ఈ రెండు గ్రూప్స్ మధ్య గొడవలు పెట్టేలా చేసాడు. నిన్న మొన్నటి వరకు హౌస్ లోపల ఆరంభం నుండి సెలబ్రిటీల ఆధిపత్యం చలామణి అయ్యే టాస్కులు పెడతారని మనమంతా ఊహించుకున్నాము. కానీ అలాంటిదేమి లేదు, సామాన్యుల డామినేషన్ ఉండేలాగానే ప్లాన్ చేశారు. ఇప్పటికే ఈ సీజన్ లో రెండు హౌస్ లు ఉంటాయని ప్రోమోల ద్వారా చెప్పిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ కాన్సెప్ట్ ని చాలా బలంగా మొదటి ఎపిసోడ్ నుండే ఉపయోగించనున్నారు.
సామాన్యులను ‘ఓనర్స్’ గా, సెలబ్రిటీలను ‘టెనెంట్స్’ గా పెట్టారట బిగ్ బాస్. ఇలా పెడితే మొదటి ఎపిసోడ్ నుండే కొట్లాటలు ఒక రేంజ్ లో ఉంటాయి. అసలే సామాన్యులు వేరే లెవెల్ లో ఉన్నారు. ఎక్కడా తగ్గడం లేదు. ముఖ్యంగా మాస్క్ మ్యాన్ హరీష్, శ్రీజా దమ్ము, మర్యాద మనీష్ వంటి వారు చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం. సెలబ్రిటీలను చూస్తుంటే ఈసారి అంత బలమైన వాళ్ళు లేరు. కేవలం తనూజ, రీతూ చౌదరి మరియు ఇమ్మానుయేల్ మాత్రమే కాస్త గొంతు పైకి లేపి మాట్లాడేవాళ్ళు. మిగిలిన కోనెటస్టెంట్స్ లో సుమన్ శెట్టి కాస్త మెతక మనిషే, మరో పక్క ఆశా షైనీ అనే అమ్మాయి చాలా సాఫ్ట్ అని టాక్. భరణి శంకర్ ఒక్కడు కాస్త గొడవలు పెట్టుకునే రకం లాగా అనిపిస్తున్నాడు కానీ, ఆయన గురించి పూర్తిగా ఎవరికీ తెలియదు. ఇక రామ్ రాథోడ్ ని చూస్తే ఆయన కూడా మెతక మనిషి లాగానే అనిపిస్తున్నాడు.
ఒకప్పుడు సామాన్యులు మొదటి వారం లో నామినేషన్స్ లోకి వస్తే ఎలిమినేట్ అయిపోతారేమో అనే భయం ఉండేది. ఎందుకంటే రెండవ సీజన్ లో సంజన అనే అమ్మాయి సామాన్యురాలిగా హౌస్ లోకి వచ్చి,మొదటి వారం నామినేషన్స్ లోకి రాగానే అలాగే వెళ్ళిపోయింది. కానీ ఈసారి అలాంటి పరిస్థితి లేదు. సామాన్యులకు అగ్నిపరీక్ష షో ద్వారా బలమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. నాలుగు వారాలు వరుసగా నామినేషన్స్ లోకి వచ్చినా తట్టుకోగలరు. సెలబ్రిటీలే నామినేషన్స్ లోకి మొదటి వారం రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా సుమన్ శెట్టి , ఆశా షైనీ, భవాని శంకర్, సంజన గల్రాని వంటి కంటెస్టెంట్స్ అసలు రాకూడదు. ఎందుకంటే వీళ్లకు అసలు ఫ్యాన్ బేస్ లేదు, వస్తే మొదటి వారం లోనే ఎలిమినేట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి చూడాలి రాబోయే రోజుల్లో ఈ సీజన్ ఎలా ఉండబోతుంది అనేది.