Bigg Boss Telugu 9 Agnipariksha Promo: నిన్న విడుదలైన అగ్నిపరీక్ష ప్రోమో చూస్తే ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) మామూలు రేంజ్ లో ఉండేలా లేదు, టెలికాస్ట్ కి ముందే బ్లాక్ బస్టర్ అయిపోయింది అనే ఫీలింగ్ కలుగుతుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సీజన్ కోసం అలాంటి సెటప్ ని డిజైన్ చేశారు మరి. సాధారణంగా సామాన్యులను ఎంపిక చేసి హౌస్ లోకి పంపుంటే ఈ సీజన్ పై ఇంతటి హైప్, క్రేజ్ క్రియేట్ అయ్యేది కాదేమో. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో దరఖాస్తులను స్వీకరించి, అలా వచ్చిన వేల ధరఖాస్తులలో కేవలం 200 మందిని ఎంపిక చేసి, ఆ 200 మందికి ఇంటర్వ్యూలు, గ్రూప్ డిస్కషన్స్ ని నిర్వహించి, కేవలం 42 మందిని ఎంపిక చేసి ‘అగ్నిపరీక్ష'(Agnipareeksha) షో కి పంపించారు. రేపటి తో ఈ షో కి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి కానుంది.
ఆగష్టు 22 నుండి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. అన్ని ఎపిసోడ్స్ ని ఒకేసారి అప్లోడ్ చేయరు, రోజుకి ఒక ఎపిసోడ్ ని మాత్రమే అప్లోడ్ చేస్తారు, సెప్టెంబర్ 5 వరకు ఈ షో ప్రసారం కాబోతుంది. ఇదంతా పక్కన పెడితే నిన్న విడుదల చేసిన ప్రోమోలో ఒక కాళ్ళు లేని వ్యక్తి ని మీరంతా గమనించే ఉంటారు. ఇతను ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ‘అగ్ని పరీక్ష’ షో తర్వాత ఫ్యాన్ బేస్ రావడం కాదు, ఆ షో మొదలు అవ్వకముందే ఇతనికి ఫ్యాన్ బేస్ ఏర్పడిపోయింది. ఎందుకంటే ఇతను గతం లో పలు షోస్ లో కనిపించాడు. ముఖ్యంగా లక్షలాది మంది అభిమానులు చూసే ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ షో లో స్వయంగా బాలయ్య ఇతని గురించి వివరించి అభినందిస్తాడు. అలా ఇతను ఆడియన్స్ కి ముందుగానే పరిచయం ఉన్నాడు, అలాంటి వ్యక్తి బిగ్ బాస్ హౌస్ కి వస్తున్నాడని అనగానే అందరిలో ఆసక్తి పెరిగింది.
ఇతని పేరు ప్రసన్న కుమార్. ఇతను సాధారణమైన వ్యక్తి కాదు,ఒక ఫోటో గ్రాఫర్, ట్రావెల్లర్, బైక్ రైడర్, 21 కిలోమీటర్ల రన్నింగ్ రేస్ లో గోల్డ్ మోడల్ సాధించిన వ్యక్తి. ఇదంతా ఆయన కాళ్ళు లేకుండానే చేసాడు. తనపై ఎవరైనా కాళ్ళు లేవని జాలి చూపిస్తే అసలు ఒప్పుకునే టైపు కాదు ఇతను. చాలా బలమైన ఆత్మవిశ్వాసం గల వ్యక్తి. తన మీద జాలి చూపించకండి అంటూ అగ్నిపరీక్ష ఎపిసోడ్స్ లో కూడా ఇతను కోరాడట. అంతే కాదు ‘అగ్నిపరీక్ష’ ఇతను చేస్తున్న టాక్సులను చూసి జడ్జీలకు కూడా మతి పోతుందట. అతిగా మాట్లాడే వ్యక్తి కాదు, టాస్కులు బాగా ఆడుతాడు, తోటి వారితో బాగా కలిసిపోతాడు, ఎంటర్టైన్మెంట్ కోణం కూడా ఉంది, బిగ్ బాస్ కి కావాల్సిన అర్హతలు మొత్తం ఇతనిలో ఉన్నాయి, కాబట్టి ఇతను కచ్చితంగా ‘బిగ్ బాస్ 9’ కి కంటెస్టెంట్ గా ఎంపిక అయ్యే అవకాశం ఉంది.
