https://oktelugu.com/

Bigg Boss Telugu 8: అర్థ రాత్రి బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ పై సోనియా అరుపులు..వణికిపోయిన నిఖిల్..ఇతను ఈ జన్మలో మారడేమో !

నిన్న జరిగిన నామినేషన్స్ లో కూడా తనకి బిగ్ బాస్ ఇచ్చిన స్పెషల్ పవర్ తో సోనియా ని నామినేషన్స్ నుండి సేవ్ చేయకుండా, నైనిక ని చేస్తాడు. ఇది సోనియా మనసులో పెట్టేసుకుంది. అయితే గత వారంలో సోనియా కి నిఖిల్ రెడ్ ఎగ్ ఇచ్చి చీఫ్ అయ్యేందుకు పోటీ పడే అర్హత ని ఇచ్చాడు. నేను అయితే నువ్వు చాలా తేలికగా గెలవగలవు అనే కదా నాకు తెలివిగా ఆ రెడ్ ఎగ్ ఇచ్చావు అని సోనియా నిఖిల్ తో అనింది అట.

Written By:
  • Vicky
  • , Updated On : September 24, 2024 / 04:20 PM IST

    Bigg Boss Telugu 8(42)

    Follow us on

    Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8 లో టైటిల్ ని కొట్టగలిగేంత సత్తా ఉన్న కంటెస్టెంట్స్ లో ఒకరు నిఖిల్. ఇతను ఆడే టాస్కులు చూసి ఎవరైనా అతనికి ఫ్యాన్ అవ్వాల్సిందే. మనిషి మనస్తత్వం కూడా చాలా సున్నితంగా ఉంటుంది. ప్రతీ ఎమోషన్ కి ఆయన చాలా బలహీన పడుతాడు. దీనిని అవతల వాళ్ళు ఉపయోగించుకొని గేమ్ లో సక్సెస్ అవ్వాలని చూస్తారు. సోనియా ప్రస్తుతం అదే చేస్తుంది. నిఖిల్ ఆమె పట్ల వ్యవహరిస్తున్న తీరుని చూస్తుంటే, ఈయన ఆమెకు బాడీ గార్డ్ గా మారిపోయాడా? అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె తన మాటలతో నిఖిల్ ని చాలా తేలికగా ప్రభావితం చేస్తుంది. నిఖిల్ కూడా ఇది అర్థం చేసుకొని ఆమె నుండి దూరం అయ్యేందుకు గత కొద్ది రోజులుగా చాలా ప్రయత్నం చేస్తున్నాడు.

    అందుకే నిన్న జరిగిన నామినేషన్స్ లో కూడా తనకి బిగ్ బాస్ ఇచ్చిన స్పెషల్ పవర్ తో సోనియా ని నామినేషన్స్ నుండి సేవ్ చేయకుండా, నైనిక ని చేస్తాడు. ఇది సోనియా మనసులో పెట్టేసుకుంది. అయితే గత వారంలో సోనియా కి నిఖిల్ రెడ్ ఎగ్ ఇచ్చి చీఫ్ అయ్యేందుకు పోటీ పడే అర్హత ని ఇచ్చాడు. నేను అయితే నువ్వు చాలా తేలికగా గెలవగలవు అనే కదా నాకు తెలివిగా ఆ రెడ్ ఎగ్ ఇచ్చావు అని సోనియా నిఖిల్ తో అనింది అట. ఇది నిఖిల్ యష్మీ తో మాట్లాడుతున్న సమయంలో చెప్పాడట. నిన్న నామినేషన్స్ అయ్యాక సోనియా, యష్మీ మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. ఈ గొడవలో యష్మీ నిఖిల్ తనతో అన్న మాటలను ప్రస్తావిస్తుంది. అర్థ రాత్రి అయ్యాక నిఖిల్ తో సోనియా మాట్లాడుతూ ‘యష్మీ దగ్గరకి వెళ్లి ఆ మాట ఎందుకు అన్నావు’ అంటూ చాలా పెద్దగా హౌస్ దద్దరిల్లిపోయేలా అరిచిందట. పాపం నిఖిల్ ఏమి మాట్లాడలేక సైలెంట్ గా అలా చూస్తూ ఉండిపోయాడట. సోనియా ని తిరిగి ఒక్క మాట కూడా అనలేకపోయాడు. దీనిని బట్టీ ఆయన సోనియా కు ఎంతలా లొంగిపోయాడో అర్థం అవుతుంది.

    ఇది ఇలా ఉండగా యష్మీ పై సోనియా అనేకమైన వ్యక్తిగత ఆరోపణలు చేస్తుంది. నువ్వు హౌస్ లో ఎక్కువగా నిఖిల్,పృథ్వీ నే చూస్తున్నావు అంటూ యష్మీ పై చాలా చండాలమైన ఆరోపణలు చేస్తుంది. దీనికి యష్మీ బాధపడుతూ ‘ఆ అమ్మాయి నోటికి అడ్డు అదుపు ఉండదా?, ఇంట్లో వాళ్ళు ఏమి అనుకుంటారో, ఏమో అనే కామన్ సెన్స్ కూడా లేకుండా ఎలా మాట్లాడుతుందో చూడు’ అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు నిఖిల్ ఆమె పక్కనే ఉంటూ ఓదారుస్తాడు. దీనిపై కూడా సోనియా నిన్న అర్థ రాత్రి నిఖిల్ తో గొడవ పడింది అట. మా ఇద్దరికీ గొడవ జరిగితే నువ్వు నాకు సపోర్టుగా ఉండాలి కానీ, ఆమె దగ్గరకు వెళ్తావా అంటూ కాసేపు ఈ విషయంలో కూడా గొడవ పెట్టుకుందట. ఎన్ని మాటలు అంటున్నా కూడా నిఖిల్ ఓర్పుతో భరిస్తున్నాడు, దీనిని బట్టి సోనియా కి ఆయన దాసుడుగా మారిపోయాడని, ఇలాగే ఉంటే టైటిల్ కొట్టడం కష్టం అని అంటున్నారు నెటిజెన్స్.