https://oktelugu.com/

Bigg Boss Telugu 8: గౌతమ్ ని టార్గెట్ చేసిన హోస్ట్ నాగార్జున..గ్రూప్ గేమ్స్ కి ప్రోత్సాహం..’నోరు మూసుకో’ అంటూ గౌతమ్ పై చిందులు!

గత సీజన్ తో పాటుగా ఈ సీజన్ లో కూడా గమనిస్తే నాగార్జున కి గౌతమ్ అంటే ఎందుకో అసలు ఇష్టం లేదు అనేది అర్థం అవుతుంది. చాలా చిన్న చూపు చూస్తున్నట్టుగా ఆడియన్స్ కి అనిపించింది. ఇష్టం లేనప్పుడు అతన్ని ఈ సీజన్ లోకి తీసుకొని రావడం ఎందుకు, ఇలా అవమానించడం ఎందుకు.

Written By:
  • Vicky
  • , Updated On : November 24, 2024 9:05 am
    Bigg Boss Telugu 8(240)

    Bigg Boss Telugu 8(240)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ బిగ్ బాస్ సీజన్ లో నాగార్జున హోస్టింగ్ ప్రతీ వారం ఆడియన్స్ ని నిరాశపరుస్తూనే ఉంది. ఇంత చెత్త హోస్టింగ్ ఆయన వచ్చే సీజన్స్ లో ప్లాన్ చేసుకున్నా కూడా చెయ్యలేదేమో అని అనిపిస్తుంది. హోస్ట్ అన్న తర్వాత అందరికీ సమ న్యాయంతో వ్యవహరించాలి. కానీ నాగార్జున తీరు అలా లేదు. అసలు ఆయన ఎపిసోడ్స్ చూస్తున్నారా?, లేదా టీం ఇచ్చే స్క్రిప్ట్ ని బట్టి హోస్టింగ్ చేస్తున్నాడా అనేది ఆడియన్స్ కి అర్థం కావడం లేదు. నిన్న గౌతమ్ విషయం లో ఆయన వ్యవహరించిన తీరు చూసే ఆడియన్స్ కి చాలా అన్యాయం అనిపించింది. ముఖ్యంగా ఒక్క హోస్ట్ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ గ్రూపిజం చేయొచ్చు, నామినేషన్స్ పాయింట్స్ గురించి పక్క కంటెస్టెంట్స్ తో మాట్లాడొచ్చు అని ఓపెన్ గా చెప్పుకొచ్చిన హోస్ట్ బహుశా బిగ్ బాస్ హిస్టరీ లో ఈయనే అనుకుంట.

    గత సీజన్ తో పాటుగా ఈ సీజన్ లో కూడా గమనిస్తే నాగార్జున కి గౌతమ్ అంటే ఎందుకో అసలు ఇష్టం లేదు అనేది అర్థం అవుతుంది. చాలా చిన్న చూపు చూస్తున్నట్టుగా ఆడియన్స్ కి అనిపించింది. ఇష్టం లేనప్పుడు అతన్ని ఈ సీజన్ లోకి తీసుకొని రావడం ఎందుకు, ఇలా అవమానించడం ఎందుకు. ఈ వారం గౌతమ్ తప్పు చేయలేదని ఎవ్వరూ అనలేదు, కానీ ఆయన లాగానే తప్పు చేసిన వాళ్ళను నాగార్జున పెద్దగా పట్టించుకోలేదు. ఉదాహరణకు గౌతమ్ , పృథ్వీ గొడవ విషయంలో గౌతమ్ ‘నా బొచ్చు కూడా పీకలేవు’ అన్న మాట నాగార్జున కి తప్పుగా అనిపించింది కానీ, అమర్యాదగా తన చాతి మీదున్న బొచ్చుని పీకి, దరిద్రంగా ప్రవర్తించిన పృథ్వీ ని మాత్రం ఒక్క మాట అనలేదు. బిగ్ బాస్ లో ఉన్న అతి ముఖ్యమైన రూల్ నామినేషన్స్ గురించి తోటి కంటెస్టెంట్స్ తో మాట్లాడకూడదు అనేది.

    కానీ ఈ సీజన్ లో నిఖిల్, యష్మీ, పృథ్వీ, ప్రేరణ, నబీల్ వీళ్లంతా నామినేషన్స్ గురించి లెక్కలేనన్ని సార్లు మాట్లాడుకొని ఉంటారు. గ్రూపిజం చేసి ఉద్దేశపూర్వకంగా వైల్డ్ కార్డ్స్ మీద పాయింట్స్ లేకుండా నామినేషన్స్ వేసి బయటకి పంపేశారు. ఇదంతా తప్పు కాదంట, తప్పు చేస్తున్న వాళ్ళను గ్రూపిజం చేస్తున్నారు అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన గౌతమ్ ది తప్పు అట. ఇదెక్కడి న్యాయం సామీ. నాగార్జున తప్పు కాదు అన్నంత మాత్రానా గౌతమ్ దానికి ఒప్పుకోలేదు. నా ఉద్దేశ్యంలో తప్పే అని బలంగా నిలబడ్డాడు. దీనికి నాగార్జున కి కోపం వచ్చి ‘నేను మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడకు..నోరు మూసుకో’ అని చాలా అమర్యాదగా గౌతమ్ ని అవమానించాడు. మరి విష్ణు ప్రియ కూడా నాగార్జున మాట్లాడుతున్న సమయంలో అనేక సార్లు మధ్యలో మాట్లాడింది. ఆమెకు మాత్రం ‘ఒక్క నిమిషం ఆగు అమ్మా’ అంటూ అంత మర్యాదగా మాట్లాడాడు. గౌతమ్ మీద మాత్రం ఎందుకు ఆయనకి పగ అని చూసే ఆడియన్స్ కి కూడా అనిపించింది. గౌతమ్ ని టార్గెట్ చేసి అతని గ్రాఫ్ ని తగ్గించే ప్రయత్నం అయితే చేసినట్టు స్పష్టంగా కనిపిస్తుంది కానీ, జనాలు అంత అమాయకులు మాత్రం కాదు. వీళ్ళు చేస్తున్న అన్యాయాన్ని కళ్లారా చూసారు. గౌతమ్ గ్రాఫ్ ని మరింత పెంచారు. దాదాపుగా టైటిల్ ఆయన చేతిలో పడినట్టే.