Bigg Boss Telugu 8: బిగ్ బాస్ షో ఒక స్క్రిప్ట్ ప్రకారం నడుస్తుంది, రియాలిటీ షో కాదు అని చాలా మంది అంటూ ఉంటారు. కానీ ఆ హౌస్ లో గడిపి వచ్చిన కంటెస్టెంట్స్ మాత్రం స్క్రిప్టెడ్ షో కాదు, చాలా రియాలిటీ గా ఉంటుంది, అక్కడి ఎమోషన్స్ మొత్తం నిజమైనవి అని చెప్పిన ఘటనలు చాలా ఉన్నాయి. కొంతమంది కంటెస్టెంట్స్ కి ఈ షో మీద మంచి అభిప్రాయం ఉండదు, ఎందుకంటే వాళ్ళు నెగటివ్ అయ్యారు కాబట్టి. వాళ్ళు కూడా ఈ ఇది రియాలిటీ షో అని చెప్పడమే ఇంత కాలం మనం చూసాము, స్క్రిప్టెడ్ షో అని మాత్రం చెప్పలేదు. అయితే కొంతమంది టాప్ కంటెస్టెంట్స్ కి కొన్ని ప్రత్యేకమైన అనుమతులు ఇస్తారని ఒక అప్పట్లో ఒక రూమర్ ఉండేది. మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే వరకు బయటకు వెళ్ళడానికి వీలు లేదు.
కానీ మొదటి సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా లోపలకు వచ్చిన నవదీప్ ఒకానొక సందర్భంలో ప్రత్యేక అనుమతి ద్వారా బయటకి వెళ్లి వచ్చినట్టుగా అనిపించింది. అంతే కాకుండా ఈ సీజన్ లో నిఖిల్ కూడా ఒక నాలుగు గంటలు హౌస్ లో ఎక్కడా కనపడడు. హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ ని చూసే ప్రేక్షకులకు ఈ విషయం తెలిసే ఉంటుంది. ఆ నాలుగు గంటలు ఆయన ప్రత్యేక అనుమతితో బయటకి వెళ్లి వచ్చాడు అని మనం అనుకోవచ్చు. ఇదంతా పక్కన పెడితే హౌస్ లో ఉన్నన్ని రోజులు బిగ్ బాస్ అవకాశం కల్పిస్తే తప్ప, ఇంట్లో వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉండదు. కానీ సోషల్ మీడియా లో కాసేపటి క్రితమే గంగవ్వ మాట్లాడిన ఒక వీడియో తెగ వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే నబీల్ గంగవ్వ తో మణికంఠ గురించి మాట్లాడుతూ ‘వీకెండ్ కి ఆయన వేసుకునే బట్టలు చూస్తున్నావా గంగవ్వ, ఎంత స్టైల్ గా ఉంటాయో, ఇద్దరు డిజైనర్లు ఉన్నారు ఆయనకి’ అని అంటాడు. అప్పుడు గంగవ్వ మాట్లాడుతూ ‘నాకు అలాంటివి ఏమి లేవే, ఉన్న చీరలనే పిండుకుంటూ ఉంటున్నా’ అని అంటుంది.
దానికి మణికంఠ ‘నేను కూడా పిండుకున్నాను కదే మొన్న’ అని అంటాడు. అప్పుడు గంగవ్వ మాట్లాడుతూ ‘మొన్ననే ఫోన్ లో మీ వాళ్ళతో మాట్లాడినావు కదా, ఆ బట్టలు తీసుకొని రా, ఈ బట్టలు తీసుకొని రా అన్నావు’ అని అంటుంది గంగవ్వ. దీనిని బట్టి అవసరం అయ్యినప్పుడల్లా ఇంట్లో వాళ్ళతో మాట్లాడేందుకు బిగ్ బాస్ వెసులుబాటు కల్పించాడని ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. వీకెండ్స్ కంటెస్టెంట్స్ వేసుకునే బట్టలు ఒక్కోసారి ఇంటి నుండే వస్తుంటాయి. కానీ నేరుగా కంటెస్టెంట్స్ బట్టల గురించి ఇంట్లో వాళ్ళతో ఫోన్ మాట్లాడేంత సౌకర్యం బిగ్ బాస్ కల్పిస్తుండడాన్ని చూస్తుంటే ఇదంతా స్క్రిప్టెడ్ షో లాగానే అనిపిస్తుందంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.