Bigg Boss Telugu 7: బిగ్ బాస్ షోలో రాజకీయాలు ఉంటాయి. ఇది జెన్యూన్ గేమ్ కాదనే వాదన చాలా కాలంగా ఉంది. చాల సందర్భాల్లో ఎలిమినేషన్స్ తో పాటు బిగ్ బాస్ నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. ఒక ఓటింగ్ విషయంలో కూడా అనుమానాలు ఉన్నాయి. కారణం జనాలు వేసే ఓటింగ్ లెక్కలు బయటకు రావు. కొన్ని లెక్కలు ప్రచారం అవుతున్నా ఎంత వరకు అవి కరెక్ట్ అనేది తెలియదు. కొందరు కంటెస్టెంట్స్ ముందుగానే ఒప్పందం కుదుర్చుని వస్తారని సమాచారం.
అంటే కొన్ని వారాల వరకు వాళ్ళ గేమ్ ఎలా ఉన్నా ఎలిమినేట్ చేయరు. తాజా సీజన్లో సీరియల్ బ్యాచ్ కి బిగ్ బాస్ ఫేవర్ చేస్తున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. మూడో కంటెండర్ అయ్యే ఛాన్స్ అమర్ దీప్, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్ కి బిగ్ బాస్ నేరుగా ఇచ్చాడు. టాస్క్స్ శోభా శెట్టి, అమర్ దీప్ కంటే కష్టపడినోళ్లు ఉన్నారు. ఆ విషయం పక్కన పెడితే.. నిన్న చికెన్ టాస్క్ లో శోభా శెట్టిని విన్నర్ గా ప్రకటించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
అత్యంత కారంగా ఉన్న చికెన్ తినాలని శోభా శెట్టికి బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. ఆమె దాదాపు గంట సమయంలో 27 పీసులు తిన్నది. ఆమెకు వ్యతిరేకంగా ఓటు వేసిన పల్లవి ప్రశాంత్, శుభశ్రీ, గౌతమ్ కృష్ణలకు కూడా చికెన్ తినే టాస్క్ పెట్టాడు. తక్కువ సమయంలో ఎక్కువ చికెన్ పీసులు తిన్న కంటెస్టెంట్ శోభా శెట్టి స్థానంలో కంటెండర్ స్థానానికి పోటీపడొచ్చు అన్నాడు. నిర్ణీత సమయంలో గౌతమ్ కృష్ణ 28 పీసులు తిన్నాడు. పల్లవి ప్రశాంత్ కూడా 27 తిన్నాడు.
అయితే గౌతమ్ కృష్ణ 28వ పీస్ పూర్తిగా తినలేదని సందీప్ దాన్ని కౌట్ లోకి తీసుకోలేదు. అయినప్పటికీ తక్కువ సమయంలో 27 పీసులు తిన్న గౌతమ్ ని విన్నర్ గా ప్రకటించాడు. అయితే బిగ్ బాస్ దీన్ని ఒప్పుకోలేదు. శోభా శెట్టి 27 పీసులు తిన్నది. ఆమె కంటే ఎక్కువ తినాలి. గౌతమ్ కూడా 27 పీసులే తిన్నాడు కాబట్టి శోభా విన్నర్ అని నిర్ణయించాడు. ఇది పూర్తిగా రాంగ్ డెసిషన్. ఆమె గంటలో తింటే గౌతమ్ నిమిషాల వ్యవధిలో తిన్నాడు. సమయం పక్కన పెడితే ఇద్దరూ సమానంగా తిన్నారు. అయినప్పటికీ శోభాకు ఫేవర్ గా బిగ్ బాస్ తీర్పు చెప్పాడు. ఇది అన్యాయం అన్నమాట వినిపిస్తోంది.