Bigg Boss Telugu 6- Inaya Sultana-RJ Surya: ఆర్జే సూర్య హౌస్ కొత్త కెప్టెన్ గా అవతరించాడు. ‘ఆఖరి వరకు ఆగని పరుగు’ టాస్క్ లో అతడు గెలిచి కెప్టెన్ అయ్యాడు. చివర్లో రోహిత్-ఆర్జే సూర్య మధ్య పోటీ ఏర్పడింది. ఇంటి సభ్యులు వీరిలో ఒకరిని కెప్టెన్ గా ఎన్నుకోవాలి.హౌస్ మేట్స్ కోసం రోహిత్ రెండు వారాలు నేరుగా నామినేటై పెద్ద త్యాగం చేసినప్పటికీ మెజారిటీ కంటెస్టెంట్ సూర్యకే ఓటేశారు. చివరకు రోహిత్ భార్య మెరీనా కూడా సూర్యనే ఎంచుకుంది. ఇదిలా ఉంటే గేమ్, టాస్క్స్ పరంగా ఆకట్టుకుంటున్న సూర్య ఎఫైర్స్ కారణంగా నెగిటివిటీ మూటగట్టుకుంటున్నాడు. ఆరు వారాల్లో అతడు ఇద్దరు అమ్మాయిలతో రొమాన్స్ చేశాడు.

ఆరోహి ఉన్నంత కాలం ఆమెతో చాలా సన్నిహితంగా ఉన్నాడు. ఆరోహితో ముద్దులు, హగ్గులు కానిచ్చేశాడు. ఆమె నాలుగో వారం ఎలిమినేటై వెళ్ళిపోయింది. వెంటనే ఇనయాను తగులుకున్నాడు. అటు నుండి ఇనయా పూర్తిగా ద్వారాలు తెరిచేసింది. తమ రిలేషన్ కుడా ఓపెన్ చెప్పశారు. దీంతో దాపరికం లేకుండా ప్రేమించుకుంటున్నారు.ఒకే కంచం ఒకే మంచం అన్నట్లు ఉంది వ్యవహారం. ఇనయా ఏకంగా బావ అని సంబోధించడం విశేషం. ఇనయా చప్పరించిన లాలీపాప్ సూర్య తినడం మరింత దారుణం.
వీలు దొరికితే చాలు ఓ మూలకెళ్లి రొమాన్స్ స్టార్ట్ చేస్తున్నారు. హౌస్లో ఇంత ఓపెన్ గా ఎఫైర్ నడుపుతున్న సూర్యకు హౌస్ బయట లవర్ ఉంది. ఆమెను సూర్య బుజ్జమ్మ అని పిలుచుకుంటాడు. ఈ విషయం హోస్ట్ నాగార్జునకు కూడా తెలుసు. లోపల ఆర్జే సూర్య ఎఫైర్స్ నడుపుతుండగా ఆమె ఫీలింగ్ ఏంటని తెలుసుకోవడం జరిగింది. అయితే అవేమీ పట్టించుకోకుండా బుజ్జమ్మ ఫుల్ సప్పోర్ట్ ఇస్తుంది. ఆర్జే సూర్య గేమ్ మాత్రమే చూడండి, అతడు ఎవరికి దగ్గరవుతున్నాడు. ఎలాంటి రిలేషన్స్ నడుపుతున్నాడు అనేది అనవసరం అన్నారు.

ఆరోహితో సూర్యకు ఎప్పటి నుండో పరిచయం ఉంది. వాళ్ళది స్వచ్ఛమైన స్నేహం. హౌస్లో కొంచెం ఎక్స్ట్రీమ్ అయినట్లు కనిపించింది. దాని వలన సూర్య ట్రోల్స్ కి గురయ్యాడు. సూర్య బాగా గేమ్ ఆడుతున్నాడు. అతడు ఫైనల్ కి వెళితే చాలు అనుకున్నాము. ఇప్పుడు టైటిల్ ఫెవరేట్ అయ్యాడు. బిగ్ బాస్ ఓటీటీ ఆఫర్ వచ్చినా సూర్య వెళ్ళలేదు. బిగ్ బాస్ 6 అవకాశం కూడా చివరి క్షణంలో వచ్చింది. నాలుగు రోజుల ముందు అధికారికంగా మెయిల్ వచ్చింది. సూర్య ఎవరితో సన్నిహితంగా ఉంటున్నాడు అనేది పట్టించుకోకండా అతనికి సప్పోర్ట్ చేయండి స్టాండ్ తీసుకోండని, బుజ్జమ్మ చెప్పారు.
బుజ్జమ్మ అసలు పేరు మృదుల అని తెలుస్తుంది. ఆమె ఒక టెక్ కంపెనీలో హెచ్ ఆర్ జాబ్ చేస్తున్నారు. దాదాపు పదేళ్లుగా సూర్యతో బుజ్జమ్మకు పరిచయం ఉంది. ఆ పేరు కూడా ఆమెకు సూర్యనే పెట్టాడట.