spot_img
Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Shivaji: కంటి చూపును కోల్పోయిన బిగ్ బాస్ శివాజీ..కన్నీళ్లు రప్పిస్తున్న లేటెస్ట్ కామెంట్స్!

Bigg Boss Shivaji: కంటి చూపును కోల్పోయిన బిగ్ బాస్ శివాజీ..కన్నీళ్లు రప్పిస్తున్న లేటెస్ట్ కామెంట్స్!

Bigg Boss Shivaji: బిగ్ బాస్ తెలుగు 7 ముగిసి నెల రోజులు అవుతుంది. కంటెస్టెంట్ శివాజీ ఏదో ఒక రూపంలో వార్తల్లో నిలుస్తున్నాడు. శివాజీ టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం అయ్యాడు. ఈసారి టైటిల్ శివాజీదే అని పలువురు భావించారు. చివరి వారాల్లో సమీకరణాలు మారిపోయాయి. కొన్ని ఎపిసోడ్స్ శివాజీకి వ్యతిరేకంగా పడ్డాయి. దాంతో టైటిల్ చేజారింది. హౌస్ నుండి బయటకు వచ్చాక శివాజీ ఆరోపణలు చేశాడు. ఎడిటింగ్ ద్వారా నన్ను విలన్ గా చూపించారు. కొందరిని మాత్రమే కావాలనే లేపారని శివాజీ అసహనం వ్యక్తం చేశాడు.

ఈ విషయంలో స్టార్ మా కు సంబంధం లేదు. బిగ్ బాస్ షో నిర్వాహకుల్లో ఎవరో ఒకరు ఇదంతా చేశాడని శివాజీ అనుమానం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ షో తన ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపిందట. హౌస్లో ఉన్నన్నాళ్లు తన శరీరంలో చోటు చేసుకున్న కొన్ని మార్పుల గురించి శివాజీ చెప్పుకొచ్చాడు.

నా సామిరంగ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, దర్శకుడు విజయ్ బిన్నీలను శివాజీ ఇంటర్వ్యూ చేశాడు. ఈ క్రమంలో నాగార్జున శివాజీని ఒక ప్రశ్న అడిగాడు. బిగ్ బాస్ షో అనంతరం లైఫ్ ఎలా ఉందని అడిగాడు. ఎవరు ఏమనుకున్నా బిగ్ బాస్ ఒక అద్భుతమైన షో.ఎక్కడైనా నేను ఇదే చెబుతాను. అదొక ప్రపంచం. అక్కడ అబద్దాలు, ఫోన్లు, దురాశ ఏమీ ఉండవని, శివాజీ అన్నాడు.

ఆయన ఇంకా మాట్లాడుతూ… బిగ్ బాస్ హౌస్లో నా కంటి చూపు మెరుగైంది. గతంలో గ్లాసెస్ లేకుండా కొన్ని చూడలేకపోయేవాడిని. హౌస్లో గ్లాసెస్ పెట్టుకోకపోయినా చదవడం గమనించాను. మొబైల్ చూడటం మానేయడం వలనే నా కంటి చూపు మెరుగైంది. బయటకు వచ్చాక మరలా చూపు సమస్య మొదలైందని, శివాజీ చెప్పుకొచ్చాడు. ఆదివారం నేను కూడా మొబైల్ స్విచ్చాఫ్ చేసి ఎవరినీ కలవకుండా ప్రశాంతంగా ఉంటానని నాగార్జున చెప్పుకొచ్చారు.

RELATED ARTICLES

Most Popular