Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ఎనిమిదో వారం నామినేషన్స్ హాట్ హాట్ గా సాగుతున్నాయి. సోమవారం నామినేషన్ ప్రక్రియ మొదలవగా ఈ రోజు కూడా కొనసాగుతుంది.అయితే కంటెస్టెంట్స్ ఓ రేంజ్ లో గొడవపడ్డారు. ఇక తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే హౌస్ లో మరింత రచ్చ జరిగినట్లు అనిపిస్తుంది. ముందుగా ప్రిన్స్ యావర్, శోభా శెట్టి ని నామినేట్ చేశాడు. శోభా నేను హిట్లర్ అనే మాట అన్నానా అని యావర్ ప్రశ్నించాడు.
దానికి శోభా నేను ఆ మాట అన్నాను కానీ అలా అనలేదు అని అన్నావ్ అందుకే నిన్ను నామినేట్ చేశా అంటూ శోభా రెచ్చిపోయింది. శోభా అలా మాట్లాడొద్దు .. నేను హిట్లర్ అని అనలేదు అంటూ యావర్ ఫైర్ అయ్యాడు. ఇక తర్వాత అమర్ దీప్ భోలే ని నామినేట్ చేసి గేమ్ ఆడలేదు అని రీజన్ చెప్పాడు.
దాంతో భోలే,అమర్ కి దిమ్మతిరిగే సమాధానం చెప్పాడు. ఒకటి,రెండు,మూడు,నాలుగు వారాల్లో నువ్వేం గేమ్ ఆడావయ్యా అంటూ గట్టి స్ట్రోక్ ఇచ్చాడు.దానికి మొదటి ఐదు వారాలు ఆడింది కూడా గేమే అంటూ అమర్ అన్నాడు.’ ఆ మాకు అర్ధమౌతుంది లే ‘నీలో ఒక్క పాజిటివ్ కూడా లేదు అన్నీ నెగిటివ్ అని భోలే అన్నాడు. దాంతో అమర్ చేతిలో ఉన్న భోలే ఫోటో మంటలో విసిరాడు. యావర్ తన రెండో నామినేషన్ సందీప్ మాస్టర్ కి వేశాడు.దీంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది.
మీరు సెల్ఫిష్ అని అనిపిస్తుంది,సేఫ్ ప్లేయర్ అని యావర్,సందీప్ తో అన్నాడు.నీకంటే సేఫ్ ప్లేయర్ ఎవరు లేరు అని సందీప్ అన్నాడు. అందుకే నేను ఫస్ట్ వీక్ నుంచి నామినేషన్స్ లో ఉన్న నువ్వు లెవ్వు సేఫ్ ప్లేయర్ అని ప్రిన్స్ చెప్పాడు. ఇక సందీప్ రెచ్చిపోయి బూతులు మాట్లాడాడు.అతను అబ్యూజ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు అంటూ భోలే మధ్యలో కి దూరాడు. దాంతో గొడవ ఇంకా పెద్దదైంది. శివాజీ, సందీప్ కి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. సందీప్ ఏ మాత్రం తగ్గకుండా నోరేసుకుని పడిపోయాడు. తర్వాత అమర్ శివాజీ ని నామినేట్ చేశాడు.శివాజీ ఫోటో మంటలో వేశాడు అమర్ దీప్.