Bigg Boss Season 6 TRP Rating: తెలుగు బుల్లితెర ఎంటర్టైన్మెంట్ విభాగం లో ప్రభంజనం సృష్టించిన షో ఏదైనా ఉందా అంటే అది బిగ్ బాస్ రియాలిటీ షో అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు..ఈ రియాలిటీ షో ని తెలుగు ప్రజలు ఆదరిస్తారా లేదా అనే అనుమానం తో ప్రారంభం అయ్యి, ఆ తర్వాత అద్భుతమైన ఆదరణ దక్కించుకొని 5 సీసన్స్ ని దిగ్విజయం గా పూర్తి చేసుకొని ఇప్పుడు ఆరవ సీసన్ లోకి అడుగు పెట్టి 5 వారలను పూర్తి చేసుకుంది ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో..అయితే గడిచిన బిగ్ బాస్ సీసన్స్ తో పోలిస్తే ఈ సీసన్ ఆరంభం లో చాలా తక్కువ TRP రేటింగ్స్ తోనే ప్రారంభం అయ్యింది..ఎందుకంటే ఈసారి సీసన్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ ప్రేక్షకులకు గొప్ప ముఖ పరిచయం లేని కంటెస్టెంట్స్ అవ్వడం..దానికి తోడు ఆరంభం లో హౌస్ మేట్స్ టాస్కులు సీరియస్ గా తీసుకొని ఆడకపోవడం వల్ల TRP రేటింగ్స్ అతి దారుణంగా పడిపోయాయి.

ఆ తర్వాత రెండవ వీకెండ్ లో హోస్ట్ అక్కినేని నాగార్జున హౌస్ మేట్స్ ఆటతీరు పై తీవ్రంగా విరుచుకుపడడం తో అప్పటి నుండి హౌస్ మేట్స్ ఆటను సీరియస్ గా ఆడడం ప్రారంభించారు..అప్పటి నుండి డైలీ TRP రేటింగ్స్ లో కూడా మార్పులు వచ్చాయి..రోజు రోజుకి TRP రేటింగ్స్ పెరుగుతూ వచ్చింది..ఇక వారం బిగ్ బాస్ ఇచ్చిన బ్యాటరీ ఛార్జింగ్ టాస్క్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది..ప్రేక్షకులు ఈ టాస్కుకి బాగా కనెక్ట్ అయ్యారు..దానితో TRP రేటింగ్స్ కూడా ఈ వారం అదిరిపోయాయి.

గత వారం వరుకు యావరేజి గా వారం లోని అన్ని రోజులకు కలిపి 5 లోపు TRP రేటింగ్స్ వచ్చేవి..కానీ ఈ వారం అన్ని రోజులకు కలిపి యావరేజి గా 7 TRP రేటింగ్స్ వాచినట్టు సమాచారం..ఇది బిగ్ బాస్ సీసన్ 6 ప్రారంభమై అన్ని వారాలకు కలిపి ఈ వారం హైయెస్ట్ TRP రేటింగ్స్ వచ్చిందట..బిగ్ బాస్ యాజమాన్యం మరియు అక్కినేని నాగార్జున కూడా ఈ TRP రేటింగ్స్ పట్ల చాలా సంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది..ఇదే ఊపు లో ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో భవిష్యత్తులో కూడా కొనసాగుతుందో లేదో చూడాలి.