Bigg Boss Season 6 TRP Ratings: తెలుగు బుల్లితెర పై బిగ్ బాస్ సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈ రియాలిటీ షో ఏ స్థాయి ప్రభంజనం సృష్టించింది అంటే..ఆడియన్స్ మరో ఎంటర్టైన్మెంట్ షో పై ఆసక్తి చూపలేనంత రేంజ్ లో ప్రబంజనం సృష్టించింది..ఇప్పటి వరుకు 5 సీసన్స్ ని పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో..5 సీసన్స్ కూడా ఒకదానిని మించి ఒకటి బంపర్ హిట్ అయ్యాయి..5 వ సీసన్ పూర్తి అయినా తర్వాత బిగ్ బాస్ OTT సీసన్ ని ప్రారంభిస్తే దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది..అలా ముందు సీసన్స్ అన్నీ కూడా భారీ హిట్ అవ్వడం తో ఆరవ సీసన్ భారీ అంచనాల నడుమ ఇటీవలే ప్రారంభం అయ్యింది..అయితే గడిచిన ముందు సీసన్స్ తో పోలిస్తే ఆరవ సీసన్ ఆడియన్స్ ని ఏ మాత్రం కూడా ఆకట్టుకోలేకపోతుంది అనే చెప్పాలి..ప్రారంభ ఎపిసోడ్ కి కేవలం 8 TRP రేటింగ్స్ మాత్రమే వచ్చాయి..ముందు ప్రసారమైన సీసన్స్ ప్రారంభ ఎపిసోడ్స్ ఏది కూడా 15 TRP రేటింగ్స్ కి తగ్గలేదు..కానీ బిగ్ బాస్ సీసన్ 6 కి మాత్రం వాటిల్లో సగం కూడా రాకపోవడం విశేషం.

ఇక రెగ్యులర్ ఎపిసోడ్స్ కి వచ్చే TRP రేటింగ్స్ అయితే ఇంకా దారుణంగా ఉన్నాయి..మొదటి వారం అన్నీ రోజులకు కలిపి యావరేజి గా కనీసం 5 రేటింగ్స్ కూడా రాలేదట..ఇక రెండవ వారం అయితే అతి దారుణంగా పడిపోయాయి..దీనితో నాగార్జున గత వారం శనివారం రోజు హౌస్ మేట్స్ సరిగా ఆడడం లేదని గట్టి క్లాస్ పీకాడు..నాగార్జున కి ఇంత కోపం రావడం చూసిన ప్రతి ఒక్కరు షాక్ కి గురి అయ్యారు..నాగార్జున కోటింగ్ తర్వాత అయినా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బాగా ఆది మంచి TRP రేటింగ్స్ తెస్తారు అనుకుంటే మొదటి వారానికి రెండవ వారానికి పెద్ద తేడా ఏమి కనిపించలేదట.

హౌస్ లో గీతూ, ఇనాయ సుల్తానా మరియు రేవంత్ తప్ప మిగిలిన ఇంటి సభ్యులెవ్వరికి కూడా ఆడాలనే కసి కనిపించలేదని చెప్పాలి..నాగార్జున గారు ఎక్కడ మళ్ళీ తిడుతారో అని బయపడి ఆడుతున్నారు తప్ప..ఎవరికీ కూడా ఆడాలనే కసి కనిపించకపోవడం విశేషం..గత సీసన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఇలా లేరు..ఆట కోసం ప్రాణం కూడా పెట్టె రేంజ్ లో ఆడేవారు..కానీ ఈసారి ఇంటి సభ్యులలో ఆ కసి కనిపించడం లేదు..బాగా బోరింగ్ ఎపిసోడ్స్ అయిపోవడం తో ఈ షో ని స్పాన్సర్ చేసే బ్రాండ్స్ ఒక్కొక్కటిగా తప్పుకుంటున్నాయట..మరి ఈ షో ని జనరంజకంగా మర్చెందుకు బిగ్ బాస్ టీం ఏమైనా సరికొత్త ప్లన్స్ వేస్తున్నారో లేదో చూడాలి.