Bigg Boss 6 Telugu Arohi Rao: బిగ్ బాస్ హౌస్ లో ఫైట్స్ చాలా కామన్. ఫ్రెండ్స్, లవర్స్, భార్యాభర్తల మధ్య కూడా ఇంటి పరిస్థితులు గొడవలు పెట్టేస్తాయి. బిగ్ బాస్ పెట్టే టాస్క్లు కంటెస్టెంట్స్ ని శత్రువులుగా మార్చేస్తాయి. కాగా బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్స్ ఆరోహిరావు, ఆర్జే సూర్య మధ్య చిన్న గొడవ జరిగింది. సీమటపాకాయ్ ఆరోహిరావు ఫ్రెండ్ ఆర్జే సూర్యకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఆర్జే సూర్యతో ఆరోహిరావు చేసిన కామెంట్ గొడవకు దారి తీసింది. ఇంటిలో మనం కేవలం కంటెస్టెంట్స్ మాత్రమే. ఇద్దరం టైటిల్ కోసం ఇక్కడికి వచ్చామని ఆరోహిరావు అంది. అవునా ఆల్ ది బెస్ట్. ఇకపై ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలంటే నీతోనే స్టార్ట్ చేస్తానని సూర్య అన్నాడు.

ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి. ఈ క్రమంలో ఆరోహిరావు కోపంతో ఊగిపోయింది. నీ దవడ పగులుద్ది, బయటికెళ్ళాక నీ సంగతి చూస్తా అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. గొడవ అంతకంతకు పెద్దది అయ్యేలా కనిపించడంతో కీర్తి ఎంట్రీ ఇచ్చింది. ఇద్దరికీ నచ్చ జెప్పే ప్రయత్నం చేసింది. దాంతో ఆర్జే సూర్య ఆరోహిరావుకి సారి చెప్పి వివాదం ముగించాడు. నిజానికి ఆర్జే సూర్య, ఆరోహిరావుకు ఎప్పటి నుండో పరిచయం ఉంది. హౌస్ లో వీరిద్దరే ఎక్కువగా కలిసి ఉంటున్నారు.
మరోవైపు సోమవారం నామినేషన్స్ కావడంతో హౌస్ హీటెక్కింది. నామినేషన్స్ ప్రక్రియలో కంటెస్టెంట్స్ మధ్య వాడి వేడి చర్చలు, వాగ్వాదాలు నడిచాయి. కంటెస్టెంట్స్ నుండి అత్యధికంగా ఆరోపణలు ఎదుర్కొన్నవారు నామినేట్ అయ్యారు. మొత్తంగా రెండో వారంలో ఎలిమినేషన్ కి గాను రాజశేఖర్, షాని, అభినయశ్రీ, రోహిత్-మెరీనా, ఫైమా, గీతూ, ఆదిరెడ్డి, రేవంత్ నామినేట్ అయ్యారు. ఈ ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నుండి ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా వచ్చేవారం ఒకరు ఎలిమినేట్ కానున్నారు.

కాగా ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ బిగ్ బాస్ రద్దు చేశాడు. ఇనయ సుల్తానా, అభినయశ్రీలలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండగా ఇద్దరినీ సేవ్ చేశారు. మొదటి వారం కావడంతో ఒక ఛాన్స్ ఇచ్చిన బిగ్ బాస్ మంచి ఆట తీరు కనబరచాలని చెప్పాడు. దీంతో హౌస్ లో మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ కొనసాగుతున్నారు. వచ్చేవారం మాత్రం ఒకరు బట్టలు సర్దుకోనున్నారు. ఈసారి సింగర్ రేవంత్, బాల ఆదిత్య, కీర్తి భట్, చలాకీ చంటి, ఫైమా వంటి సెలెబ్రిటీలు షోలో పాల్గొన్నారు.