Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ఏడో వారం కెప్టెన్సీ టాస్క్ చాలా సరదాగా సాగుతుంది.కంటెస్టెంట్స్ ని జిలేబి పురం -గులాబీ పురం అంటూ రెండు టీమ్స్ గా విభజించారు.ఇందులో భాగంగా గ్రహాంతర వాసులని మెప్పించేందుకు టాస్క్ లు ఇస్తున్నారు బిగ్ బాస్. నిన్నటి ఎపిసోడ్ లో జరిగిన ఎగ్ టాస్క్ లో జిలేబి పురం గెలిచింది. ఇక ఈరోజు స్విమ్మింగ్ పూల్ లో అండర్ వాటర్ టాస్క్ పెట్టారు.గ్రహాంతర వాసుల స్పేస్ షిప్ కి సంబంధించిన ఫ్యూయల్ రాడ్ ని ఒక బాక్స్ లో పెట్టి తాళాలు వేసి స్విమ్మింగ్ పూల్ లో ఉంచారు.
రెండు టీమ్స్ లో నుంచి చెరో ప్లేయర్ స్విమ్మింగ్ పూల్ లోకి దిగి బాక్స్ ఓపెన్ చేసి ఫ్యూయల్ రాడ్ ని తియ్యాలి.ముందుగా ఫ్యూయల్ రాడ్ ని తెచ్చి ఫ్యూయల్ సెల్ కి తగిలించిన టీమ్ విన్నర్స్ అవుతారు. ఇక గులాబీపురం నుంచి అమర్ దీప్ పూల్ లోకి దిగాడు. తేజ కీస్ అందించాడు. జిలేబీపురం నుంచి సందీప్ స్విమ్మింగ్ పూల్ లో దిగితే, ప్రియాంక తాళాలు అందించింది. వరుసగా ఒక్కో కీ అందించారు తేజ ఇంకా ప్రియాంక.
ప్రియాంక ఇచ్చిన కీ తో సందీప్ బాక్స్ ఓపెన్ చేశాడు. అందులో ఉన్న ఫ్యూయల్ రాడ్ ని తీస్తుంటే,అమర్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఇక ఇద్దరు కాసేపు నీటిలో కొట్టుకున్నారు. బయట ఉన్న ప్రియాంక, శోభా తెగ అరిచారు. సందీప్ ఫ్యూయల్ రాడ్ ని తీసుకుని బయటకి విసిరాడు. ప్రియాంక క్యాచ్ పట్టుకుని వెళ్లి ఫ్యూయల్ సెల్ కి తగిలించింది. జిలేబిపురం గెలిచి మళ్ళీ సత్తా చాటుకుంది.
ఇది ఇలా ఉండగా, తేజ కి బిగ్ బాస్ ఊహించని షాక్ ఇచ్చాడు. మీరు టాటూ వేయించుకోవాలి అంటే ఇంట్లో ఏ అమ్మాయి పేరు వేయించుకుంటారు అని అడిగారు. తేజ కెమెరా ముందుకు వెళ్లి రిక్వెస్ట్ చేశాడు. ప్లీజ్ .. బిగ్ బాస్’ అసలే పెళ్లి కావాల్సిన కుర్రాడిని టాటూలు గీటూలు అంటే ఎట్లా బిగ్ బాస్’ అని అడిగాడు. శోభా పేరు ఏ డిజైన్ లో కావాలో చెప్పమంటూ పోస్ట్ పంపించాడు బిగ్ బాస్. ‘శోభా పేరు వేయించుకోవడం కరెక్ట్ కాదు బిగ్ బాస్’ అని తేజ అన్నాడు. బిగ్ బాస్ మాత్రం తేజ మాట అస్సలు వినలేదు. మరి తేజ టాటూ వేయించుకున్నాడో లేదో తెలియాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే.
Get ready for a splash of excitement as Bigg Boss introduces an underwater task for the contestants! 🌊💦 Who will swim to victory and who will sink in this watery challenge?#BiggBossTelugu7 #StarMaa @iamnagarjuna @DisneyPlusHSTel https://t.co/nrLuPBn7XK
— Starmaa (@StarMaa) October 19, 2023