Homeఎంటర్టైన్మెంట్Bigg Boss OTT 2 Winner: బిగ్ బాస్ హౌస్ లో విన్నర్ గా నిలిచిన...

Bigg Boss OTT 2 Winner: బిగ్ బాస్ హౌస్ లో విన్నర్ గా నిలిచిన మొట్టమొదటి వైల్డ్ కార్డు ఎంట్రీ కంటెస్టెంట్…

Bigg Boss OTT 2 Winner: బిగ్ బాస్ ఓటీటీ 2 రీసెంట్గా రెండు వారాలు ఎక్స్టెన్షన్ చేయబడింది. ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటన వచ్చిన తరువాత ఇద్దరు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు తో షోలోకి ప్రవేశించారు. అందులో ఒకరు నటి ఆషిక భాటియా అయితే మరొకరు ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్. ఎల్విష్ యాదవ్ బిగ్ బాస్ రియాల్టీ షోలోకి ప్రవేశించినప్పటి నుంచి అతని గురించి ఆన్లైన్లో సెర్చ్ చేసే వారి సంఖ్య ఎక్కువయింది.

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అందరి కంటెస్టెంట్స్ లో ఎక్కువగా చర్చించుకుని వ్యక్తి అతనే అని చెప్పవచ్చు.ఎల్విష్ యాదవ్ ఆషామాషీ యూట్యూబర్ అయితే కాదు.. మిలియన్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఓ ప్రముఖ యూట్యూబర్ గా అతని చెప్పవచ్చు. అతను తీసే షార్ట్ ఫిలిమ్స్ మరియు వ్లాగ్స్ కి చాలా క్రేజ్ ఉంది. బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన మొట్టమొదటి వైల్డ్ కార్డు ఎంట్రీ కంటెస్టెంట్ గా అతను ఓసారి కొత్త రికార్డు సృష్టించాడు.

గురుగ్రామ్‌కు చెందిన ఎల్విష్ యాదవ్ రెండు యూట్యూబ్ ఛానల్స్ నడుపుతాడు. ఇందులో ఎల్విష్ యాదవ్ అని అతని పర్సనల్ ఛానల్ కి 10.8 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. ఇందులో ఎక్కువగా అతను తన షార్ట్ ఫిలిమ్స్ ని పోస్ట్ చేస్తారు. మరొక ఛానల్ ఎల్విష్ యాదవ్ వ్లాగ్స్ అనే పేరుతో ఉంది. ఈ ఛానల్ కు 4.75 మిలియన్ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వీటితో పాటుగా అతను సిస్టమ్_క్లోథింగ్ అనే దుస్తుల బ్రాండ్ ను నడుపుతాడు.

తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎల్విష్ సుమారు 10 నుంచి 15 లక్షల వరకు నెలకు సంపాదిస్తాడు. ఇవి కాక బ్రాండ్ ప్రమోషన్స్ అతనికి మరొక 20 లక్షలు సులభంగా సంపాదించి పెడతాయి. ఇలా సంవత్సరానికి అతని నికర ఆదాయం రెండు నుంచి మూడు కోట్ల వరకు ఉంటుంది.
అతను ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన క్షణం నుంచి ఆట మొత్తం తలకిందులుగా అయింది. ఫైనల్ విన్నర్ గా నిలిచిన ఎల్విష్ యాదవ్ కు అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు.

Bathini Surendar
Bathini Surendarhttp://oktelugu
Bathini Surendar is a Journlist and content writer with good Knowledge on News Writing. He is experience in writing stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular