Bigg Boss OTT Telugu: తెలుగు బుల్లితెరపై నంబర్ 1 రియాలిటీ షో ‘బిగ్ బాస్’. దీనికి తెలుగు జనాలు బాగా అలవాటు పడిపోయారు. ఈ షోను పిచ్చిగా చూసేశారు. ఎంతో మంది సామాన్యులు కూడా ఇందులోకి వచ్చి సెలబ్రెటీలు అయిపోయారు. అన్ని సుగుణాలున్న వారు బిగ్ బాస్ విజేతగా నిలిచారు.

బిగ్ బాస్ లోకి టీవీ, సినీ నటులతోపాటు యూట్యూబర్స్, సింగర్స్, మోడల్స్, యాక్టర్స్, యాంకర్స్, డ్యాన్సర్స్ ఇలా అన్ని రంగాలకు చెందిన వారు దాదాపు 100 రోజుల పాటు ఒకే ఇంట్లో ఉండే రియాలిటీ షో. పరిచయం లేని ముఖాలతో కలిసి ఉండడం.. వారికి కనెక్ట్ కావడం.. గేమ్స్ ఆడడం.. గొడవలు పెట్టుకోవడం..అబ్బో ఇలా చాలానే ఉంటాయి ఈ షోలో. అయితే రోజంతా జరిగింది కేవలం 1 గంట మాత్రమే చూపించడంతో కొందరి ప్రవర్తన తప్పుగా ప్రొజెక్ట్ అయ్యిందన్న విమర్శ ఉంది. అయితే రోజంతా చూపించడానికి టీవీలకు టైం సరిపోదు.
అందుకే పుట్టుకొచ్చింది ‘బిగ్ బాస్ ఓటీటీ’. 24 గంటల పాటు ఏం జరిగిందో చూపించకుండా కేవలం 1 గంట ఎపిసోడ్ మాత్రమే రిలీజ్ చేస్తూ కంటెస్టెంట్లపై పక్షపాతం చూపిస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో ఈ ఓటీటీ బిగ్ బాస్ మొదలైంది.
గంట చూపే బిగ్ బాస్ కు చెక్ పెడుతూ 24 గంటలు డిస్ని + హాట్ స్టార్ లో ఇక ప్రసారం కానుంది. బిగ్ బాస్ ఓటీటీ ట్రాక్ మొదలైంది. నాన్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ అంటూ రేపటి నుంచి హాట్ స్టార్ లో అలరించనుంది.
Also Read: నేటి నుంచి బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభం.. కంటెస్టెంట్లు వీరే!
తాజాగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. ఇందులో నాగార్జుననే హోస్ట్. ఆయన ఈరోజు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాడు. ఇప్పటివరకూ గంట మాత్రమే బిగ్ బాస్ చూశారని.. ఇప్పుడు 24 గంటలూ చూసి ఎవరు బాగా ఆడుతున్నారు.. ప్రవర్తిస్తున్నారు? అంచనా వేసి ఓ నిర్ణయానికి రావాలని నాగార్జున సూచించాడు. మరి ఈ ఎంటర్ టైన్ మెంట్ కు మీరూ సిద్ధంకండి.
A weekend extravaganza is on its way! Keep your phone's fully charged! Keep your popcorn tub filled! #BiggBossNonStop starts TOMORROW only on @DisneyPlusHSTel #BiggBoss #disneyplushotstar @iamnagarjuna @EndemolShineIND pic.twitter.com/G63Jc6cMbm
— JioHotstar Telugu (@JioHotstarTel_) February 25, 2022
Also Read: సీఎంల ఇంటికి కోడళ్లుగా వెళ్లిన హీరోయిన్లు వీరే
Recommended Video:
