Manus Engagement : నటుడు మానస్ నిశ్చితార్థ వేడుకగా ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ ఇందుకు వేదిక అయ్యింది. మానస్ ఎంగేజ్మెంట్ వేడుకకు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ తో పాటు బుల్లితెర సెలెబ్రిటీలు హాజరయ్యారు. మానస్ కి కాబోయే భార్య పేరు శ్రీజ అని సమాచారం. శ్రీజ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వీరిది ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిరించిన పెళ్లా అని విషయంలో స్పష్టత లేదు. మానస్ నిశ్చితార్థ వేడుకకు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ సన్నీతో పాటు ఆర్జే కాజల్, హమీద, నటి ప్రియ, యాని మాస్టర్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
View this post on Instagram
ఇక చైల్డ్ ఆరిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన మానస్ పలు చిత్రాల్లో హీరోగా నటించాడు. ఝలక్ హీరోగా అతని మొదటి చిత్రం. కాయ్ రాజా కాయ్, గోలి సోడా, గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్ చిత్రాల్లో మానస్ నటించారు. ఆయనకు సిల్వర్ స్క్రీన్ పై బ్రేక్ రాలేదు. దీంతో సీరియల్ యాక్టర్ గా మారాడు. కార్తీకదీపం సీరియల్ లో కొన్నాళ్ళు నటించాడు. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ లో లీడింగ్ రోల్ చేస్తున్నాడు.
కాగ్ బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న మానస్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి వెళ్ళాడు. అనూహ్యంగా మానస్ ట్రాన్స్ జెండర్ ప్రియాంకతో సన్నిహితంగా ఉన్నాడు. ప్రియాంక సింగ్ మానస్ వెనకే తిరిగేది. అతడు అంటే ఇష్టమని ప్రియాంక ఓపెన్ గానే చెప్పింది. మానస్ కి ప్రియాంక సేవలు చేసేది. ఈ భిన్నమైన జంట ప్రేక్షకులను అలరించారు.
View this post on Instagram
బిగ్ బాస్ సీజన్ 5లో మానస్ ఫైనల్ కి వెళ్ళాడు. అయితే టైటిల్ కొట్టలేకపోయాడు. సన్నీ -షణ్ముఖ్ జస్వంత్ టైటిల్ కోసం పోటీపడ్డారు. అధిక మొత్తంలో ప్రేక్షకులు సన్నీకి ఒక ఓటు వేసి గెలిపించారు. ఇక మానస్ టైటిల్ గెలవకున్నా ప్రేక్షకుల మదిలో రిజిస్టర్ అయ్యాడు. ఆయన పాపులారిటీ మరింత పెరిగింది. మానస్ ప్రస్తుతం సీరియల్ నటుడిగా కొనసాగుతున్నాడు.