Shivaji: బిగ్ బాస్ అనేది రియాలిటీ కాదు స్క్రిప్టెడ్ .. గుట్టురట్టు చేసిన శివాజీ!

బిగ్ బాస్ రియాలిటీ షో యాజమాన్యం ఇది స్క్రిప్టెడ్ కాదు జరిగిందే చూపిస్తాం అని డప్పు కొడుతూ వచ్చారు. కానీ కొందరు కంటెస్టెంట్స్ మాత్రం బిగ్ బాస్ గుట్టు బయట పెట్టేశారు. హోస్ట్ నాగార్జున గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Written By: NARESH, Updated On : January 4, 2024 6:53 pm

Shivaji

Follow us on

Shivaji: బిగ్ బాస్ 7 ముగిసింది కానీ జనాల్లో బిగ్ బాస్ ఫీవర్ మాత్రం తగ్గలేదు. పైగా ఈ సీజన్ ఎన్నడూ లేని విధంగా కాంట్రవర్సీ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఒక కామన్ మ్యాన్ అవ్వడమే పెద్ద విశేషం అయింది. కానీ అంతలోనే విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ సంచలనం అయింది. అనంతరం ప్రశాంత్ బెయిల్ పై బయటకు రావడంతో ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. ఈ సీజన్ ఎంత పెద్ద హిట్టో .. కాంట్రవర్సీ కూడా అదే రేంజ్ లో చుట్టుముట్టింది.

ఇది ఇలా ఉంటే .. బిగ్ బాస్ రియాలిటీ షో యాజమాన్యం ఇది స్క్రిప్టెడ్ కాదు జరిగిందే చూపిస్తాం అని డప్పు కొడుతూ వచ్చారు. కానీ కొందరు కంటెస్టెంట్స్ మాత్రం బిగ్ బాస్ గుట్టు బయట పెట్టేశారు. హోస్ట్ నాగార్జున గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన శివాజీ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. అయితే తనని లాస్ట్ నాలుగు వారాల్లో బిగ్ బాస్ వాళ్ళు కావాలనే బ్యాడ్ చేసేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు.

తాను ఎంత కష్టపడినా చిన్న ప్రశంస కూడా దక్కలేదని. కానీ కొంతమందిని మందిని ఏం చేయకపోయినా హీరో ని చేశారు. అది నేను బయటకు వచ్చాక అన్ని ఎపిసోడ్స్ చూసాను. కావాలనే చేశారని అర్ధమైంది. బాబు గారిని కూడా అడగాలనుకుంటున్నాను, ఈ విషయంలో ఎవరితో తేల్చుకోవాలో వారితోనే తేల్చుకుంటా అంటూ కొన్ని ఇంటర్వ్యూల్లో శివాజీ వెల్లడించారు. బిగ్ బాస్ రియాలిటీ షో కాదు స్క్రిప్టెడ్ అంటూ వస్తున్న వార్తలను శివాజీ నిజం అని ప్రూవ్ చేశారు.

అంతే కాదు సీజన్ 6 లో కంటెస్టెంట్ గా వచ్చిన గీతూ రాయల్ కూడా తాజా ఇంటర్వ్యూలో అదే చెప్పింది. హోస్ట్ నాగార్జున ఎపిసోడ్స్ చూడరు .. ఆయనకు స్క్రిప్ట్ ముందే వచ్చేస్తుంది అంటూ కామెంట్స్ చేసింది. దీంతో బిగ్ బాస్ జనాలకు ఓ క్లారిటీ వచ్చేసింది. కానీ మాక్రెస్ మాత్రం ఇది స్క్రిప్ట్ కాదు రియాలిటీ షో అంటూ జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ ఓటిటీ సీజన్ 2 ఫిబ్రవరి లో ప్రారంభం కానుందని టాక్ వినిపిస్తుంది.