Bigg Boss : ప్రతీ ఏడాది ప్రసారమయ్యే బిగ్ బాస్(Bigg Boss) రియాలిటీ షో కోసం ఆడియన్స్ ఎంతలా ఎదురు చూస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కొన్ని వారాల గ్యాప్ తో అన్ని భాషల్లోనూ ఒకేసారి టెలికాస్ట్ అవుతూ ఉంటుంది ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో. తెలుగు లో 8 సీజన్స్, తమిళం లో 8 సీజన్స్, కన్నడ లో 10 సీజన్స్, ఇక హిందీ లో అయితే ఏకంగా 18 సీజన్స్ పూర్తి అయ్యాయి. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ షో ఈ ఏడాది టెలికాస్ట్ అవ్వడం లేదా?, హోస్ట్ గ్యాప్ కోరుకుంటున్నాడా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం. ఇప్పుడు మేము మాట్లాడుతున్నది తెలుగు బిగ్ బాస్ షో గురించి కాదు, హిందీ బిగ్ బాస్ షో గురించి. హిందీ బిగ్ బాస్ షో కి సల్మాన్ ఖాన్(Salman Khan) వ్యాఖ్యాతగా 18 సీజన్స్ కొనసాగాడు.
Also Read : ఓటీటీ లోకి వచ్చేసిన విక్రమ్ ‘వీర ధీర శూర’ చిత్రం..ఎందులో చూడాలంటే!
హోస్టింగ్ లో ఆయన ఒక సరికొత్త బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసి, హోస్టింగ్ అంటే ఇలా ఉండాలి అని అనిపించే రేంజ్ లో దుమ్ము లేపేసాడు. ప్రతీ సీజన్ ఒక దానిని మించి ఒకటి హిట్ అవుతూ వస్తుందంటే అందుకు కారణం కచ్చితంగా సల్మాన్ ఖాన్ హోస్టింగ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి సమస్య ఏమిటి?, ఎందుకు ఈ సంవత్సరం ఈ షో ప్రసారం అయ్యే అవకాశం లేదని అంటున్నారు అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. పూర్తి వివరాల్లోకి వెళ్తే బినిజయ్ ఆసియా, ఎండేమోల్ సంస్థలతో కలర్స్ టీవీ కి గత రెండు నెలల నుండి విబేధాలు తలెత్తాయట. కేవలం బిగ్ బాస్ షో ఒక్కట్టే కాదు, ఈ సంస్థల నుండి ప్రసారమయ్యే ‘ఖత్రోమ్ కి ఖిలాడీ’ అనే కార్యక్రమాన్ని కూడా రద్దు చేసే ఆలోచనలో ఉన్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
అయితే కొంతమంది పూర్తి గా షోలు రద్దు కావని, కేవలం వాయిదా మాత్రమే పడుతుందని చెప్పుకొస్తున్నారు. ఇందులో ఎంత మాత్రం నిజముందో చూడాలి. బిగ్ బాస్ రియాలిటీ షో ని ఇండియా వైడ్ అన్ని భాషల్లో నిర్వహిస్తున్నది ఎండేమోల్ సంస్థనే. ప్రతీ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ముంబై నుండి వచ్చే ఎండేమోల్ సంస్థ ఇచ్చే ఫలితాలు ఆధారంగానే ఎలిమినేషన్ జరుగుతుంది. మరి హిందీ లో షో ఆగిపోతే మిగిలిన భాషల్లో కూడా దాని ప్రభావం పడుతుందా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజెన్స్. కానీ అలాంటివేమీ లేదని, తెలుగు లో ఈ ఏడాది ఆగస్టు నెల నుండే షో మొదలు అవుతుందని, ఈ సీజన్ కి కూడా అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) నే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తాడని అంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో బిగ్ బాస్ గురించి ఇంకా ఎన్ని ఆసక్తికరమైన వార్తలు వినాలి అనేది.