Bigg Boss 7 Telugu : శివాజీ టీమ్ కి బిగ్ బాస్ భారీ షాక్… పడ్డ కష్టం అంతా బూడిదపాలు!

శివాజీ గోల్డెన్ బాల్ అడ్వాంటేజ్ వాళ్ళకే,బ్లాక్ బాల్ అడ్వాంటేజ్ వాళ్ళకే ఏంటి బిగ్ బాస్ అంటూ అసహనం వ్యక్తం చేసాడు.

Written By: NARESH, Updated On : November 3, 2023 5:40 pm
Follow us on

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ సీజన్ 7 తొమ్మిదో వారం’ హాల్ ఆఫ్ బాల్ ‘ అని కెప్టెన్సీ ఇచ్చారు బిగ్ బాస్. ఇందుకు కంటెస్టెంట్స్ వీర సింహాలు,గర్జించే పులులు అంటూ రెండు టీమ్స్ గా విభజించారు బిగ్ బాస్. కాగా ఇది చాలా ఆసక్తికరంగా సాగుతుంది.ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య చిచ్చులు పెడుతున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలో ఇరు టీమ్స్ మధ్య వాదనలు జరిగాయి. శివాజీ , గౌతమ్ గొడవ పడ్డారు. గత రెండు రోజులుగా టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్స్ బాల్స్ కలెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో ఒక గోల్డెన్ బాల్ ,ఒక బ్లాక్ బాల్ కూడా ఉన్నాయి.

కాగా ‘మీరు కలెక్ట్ చేసిన బాల్స్ లో ఒక బ్లాక్ బాల్ కూడా ఉంది. అది ఎవరి దగ్గర ఉంది చెప్పాలంటూ బిగ్ బాస్ అడిగారు. దాంతో వీర సింహాలు టీం బ్లాక్ బాల్ మా దగ్గరుంది అని చెప్పారు. దాంతో మీకు స్పెషల్ పవర్ లభిస్తుంది అని బిగ్ బాస్ చెప్పారు. మీ అపొనెంట్స్ దగ్గరున్న మొత్తం బాల్స్ ని మీ దగ్గరున్న బాల్స్ తో స్వాప్ చేసుకోండి అని చెప్పాడు. దీంతో గర్జించే పులులు టీం దగ్గరున్న బాల్స్ మొత్తం వీర సింహాలు టీం సొంతం చేసుకున్నారు. మూడు రోజులుగా వారు పడుతున్న కష్టం మొత్తం బూడిద పాలైంది

దీనితో శివాజీ గోల్డెన్ బాల్ అడ్వాంటేజ్ వాళ్ళకే,బ్లాక్ బాల్ అడ్వాంటేజ్ వాళ్ళకే ఏంటి బిగ్ బాస్ అంటూ అసహనం వ్యక్తం చేసాడు. తర్వాత భోలే కెప్టెన్ గౌతమ్ తో టీం లో నుంచి నేను వెళ్లి పోవాలి కానీ నా బ్లాక్ బాల్ మాత్రం కావాలి అని అన్నాడు. తర్వాత శివాజీ,గౌతమ్ మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది.

అన్న రెండు ఎట్లుంచుతారు అని గౌతమ్ అంటే అది మా ఇష్టం అని శివాజీ చెప్పాడు. మీరు రూల్స్ ఎలా మారుస్తారు అంటూ గౌతమ్ వాదించాడు. అయితే మీరే ఆడుకోండి అని గౌతమ్ అన్నాడు. దానికి శివాజీ నీ ఇష్టం వచ్చినట్టు ప్రతి సారి చెయ్యాలంటే చెయ్యము మేము .. నువ్వు అవసరం ఉన్నప్పుడు ఒకలా .. లేనప్పుడు మరోలా మాట్లాడతావు. నేనేం తప్పు చేశాను ఈ టాస్క్ లో చెప్పండి అని గౌతమ్ అన్నాడు. నువ్వు వాంటెడ్ గా వాదన పెట్టుకుంటావ్ అంటూ శివాజీ అనడంతో ఎవరికి అవసరం వాంటెడ్ వాదన అంటూ గౌతమ్ అన్నాడు.