Nagarjuna Remuneration: బిగ్ బాస్ షోకి ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఒకప్పుడు పట్టణ ప్రాంతాల ఆడియన్స్ మాత్రమే చూసేవాళ్ళు. ఈ మధ్య పల్లెల్లోకి కూడా ఈ షో క్రేజ్ పాకింది. గత ఏడు సీజన్స్ గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. బ్రిటన్ లో ప్రసారమైన బిగ్ బ్రదర్ షో బిగ్ బాస్ కి స్ఫూర్తి. ఇండియాలో హిందీ భాషలో మొదటగా బిగ్ బాస్ షో ప్రారంభమైంది. భారీ రెస్పాన్స్ రావడంతో ప్రాంతీయ భాషలకు వ్యాపించింది. తెలుగులో 2017లో మొదలైంది.
ఫస్ట్ సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్. టాప్ సెలెబ్రిటీలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ హోస్టింగ్ జనాలకు భలే నచ్చేసింది. సక్సెస్ అవుతుందా లేదా? అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ దూసుకుపోయింది. బిజీ షెడ్యూల్స్ కారణంగా ఎన్టీఆర్ సెకండ్ సీజన్ కి తప్పుకున్నారు. ఎన్టీఆర్ స్థానంలో నాని వచ్చాడు. నాని హోస్టింగ్ కి మిశ్రమ స్పందన దక్కింది. దాంతో ఆయన సీజన్ నుండి తప్పుకున్నాడు. అప్పుడు నాగార్జున ఎంట్రీ ఇచ్చారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 నుండి అప్రతిహతంగా నాగార్జున హోస్టింగ్ సాగుతుంది. ఇప్పటి వరకు ఐదు సీజన్స్ కి నాగార్జున హోస్టింగ్ చేశాడు. ఒక్క సీజన్ 6 మాత్రమే ఫెయిల్ అయ్యింది. మిగతా అన్ని సీజన్స్ గ్రాండ్ సక్సెస్. కాగా హోస్ట్ గా నాగార్జున రెమ్యునరేషన్ ఎంతో తెలుసుకోవాలనే ఆసక్తి జనాల్లో ఉంది. దీనికి సంబంధించి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం గత ఐదు సీజన్స్ కి కలిపి నాగార్జున రూ. 140 కోట్లు తీసుకున్నారట.
అంటే ఒక్కో సీజన్ కి రూ. 28 కోట్లు. ఇది నాగార్జున సినిమా రెమ్యూనరేషన్ కంటే మూడు రెట్లు అధికం అని చెప్పొచ్చు. నాగార్జున ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఆయన రెమ్యూనరేషన్ పది కోట్లు లోపే. కానీ ఒక సీజన్ కి అది కూడా శని, ఆదివారం మాత్రమే కనిపిస్తూ నాగార్జున భారీగా ఛార్జ్ చేస్తున్నాడు. అయితే బిగ్ బాస్ హోస్టింగ్ అంత సులభం కాదు. కంటెస్టెంట్స్ ని కరెక్ట్ గా జడ్జి చేస్తూ, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలి.