Bigg Boss beauty Inaya Sultana: బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా వచ్చే ఫేమ్ తో సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, పెద్ద స్టార్ అయిపోవాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు తెలుగు లో 9 సీజన్స్ పూర్తి అయ్యాయి, ఎవరో ఒకరిద్దరు మాత్రమే ఇండస్ట్రీ లో సక్సెస్ అయ్యారు కానీ, మిగిలిన కంటెస్టెంట్స్ పేర్లను కూడా మర్చిపోయారు ఆడియన్స్. ఆ రేంజ్ లో ఉపయోగపడింది అన్నమాట బిగ్ బాస్ వాళ్లకు. ఇదంతా పక్కన పెడితే ఇప్పటి వరకు జరిగిన అన్ని సీజన్స్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ సీజన్ ఏదైనా ఉందా అంటే, అది సీజన్ 6 మాత్రమే. ఈ సీజన్ లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఇనాయ సుల్తానా ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. హౌస్ లో ఉన్నప్పుడు టాస్కులు బాగా ఆడేది, ఆర్జే సూర్య తో లవ్ ట్రాక్ కూడా చాలా గట్టిగా నడిపి అప్పట్లో వార్తల్లో నిలిచింది.
ఫినాలే వరకు ఉంటుందని అంతా అనుకున్నారు కానీ, 12 వ వారం లో ఎలిమినేట్ అయ్యింది. అయితే రీసెంట్ గా ఆమె పలు సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో కనిపిస్తూ ఉంది. లేటెస్ట్ గా ఆహా మీడియా లో విడుదలైన ‘3 రోజెస్’ అనే వెబ్ సిరీస్ లో ఈమె కీలక పాత్రలో కనిపించింది. ఈ సందర్భంగా ఈ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా, ఆమె పాల్గొన్న ఒక ఇంటర్వ్యూ లో తన కెరీర్ గురించి, అదే విధంగా తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ బాగా ఎమోషనల్ అయ్యింది. ఆమె మాట్లాడుతూ ‘బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఒక ఏడాది వరకు నా కేరీర్ చాలా బాగుండేది. షాపింగ్ ఓపెనింగ్స్, ఈవెంట్స్, ఇలా కెరీర్ ని బిజీ గా ఉండేలా చేసుకున్నాను. కానీ ఆ తర్వాతి సంవత్సరం నుండి మాత్రం బాగా అవకాశాలు తగ్గిపోయాయి’.
‘ఆ సమయం లో నేను బాగా డిప్రెషన్ కి గురయ్యాను. నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు, కనీసం నేను చనిపోతే నన్ను చూసేందుకు కూడా ఎవ్వరూ రారేమో అని అనుకున్నాను. అలాంటి సమయం లో నా జీవితం లోకి అడుగుపెట్టాడు గౌతమ్ అనే వ్యక్తి . తల్లిదండ్రుల నుండి ప్రేమ దొరక్కపోతే, బయట వాళ్ళ నుండి కోరుకుంటాము, అలా గౌతమ్ నాపై విపరీతమైన ప్రేమ చూపించేలోపు అతనికి సమస్తం అర్పించేసాను. శారీరకంగా కూడా అతనితో సంబంధాలు పెట్టుకున్నాను. ఇక నా జీవితం మొత్తం అతనితోనే అని ఊహించుకున్నాను, ఎన్నో కలలు కన్నాను. చివరికి అతను నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. నేను సంపాదించిన డబ్బు, ఫేమ్ అన్ని ఉపయోగించుకొని, అవసరాలకు నన్ను వాడుకొని, చివరికి వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ నేను ఆ ట్రామా నుండి బయటపడలేదు, ప్రతీ రోజు రాత్రి నరకం అనుభవిస్తున్నాను, నిద్ర మాత్రలు వేసుకోనిదే నిద్ర పట్టడం లేదు’ అంటూ చాలా ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది ఇనాయ సుల్తానా.