Bigg Boss 9 Telugu Updates: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) షో ఎంత మంచి కంటెంట్ తో ముందుకు పోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. మొదటి ఎపిసోడ్ నుండే గొడవలతో ఆడియన్స్ కి బోలెడంత కంటెంట్ ని అందించిన ఈ షో, ఇప్పుడు రోజులు గడిచేకొద్దీ మరింత కఠినం అవుతుంది. గత సీజన్ లో లాగానే ఈ సీజన్ లో కూడా వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ఎంట్రీ ఉండబోతుంది. ఈ ఎపిసోడ్ వచ్చే వారం టెలికాస్ట్ కానుంది. సుమారుగా ఆరు నుండి 8 మంది వరకు ఈ వైల్డ్ కార్డ్స్ గా షో లోకి అడుగుపెట్టబోతున్నారు. అయితే అంత మంది లోపలకు వస్తున్నారు కాబట్టి, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే హౌస్ నుండి శ్రేష్టి వర్మ, ప్రియా, మనీష్ మరియు హరీష్ వంటి వారు ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది చూడాలి.
ఇకపోతే ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ చాలా కొత్త పద్దతిలో నిర్వహించాడు బిగ్ బాస్. ఒక పెద్ద బెడ్ ని గార్డెన్ లో ఏర్పాటు చేసి, ఫ్లోరా మరియు రాము తప్ప, మిగిలిన కంటెస్టెంట్స్ అందరినీ ఆ బెడ్ పైన నిల్చోబెట్టాడు బిగ్ బాస్. ఈ వారం మీరంతా నామినేట్ అయ్యారు, ఈ నామినేషన్ నుండి ఇమ్మ్యూనిటీ పొందే అవకాశం మీకు బిగ్ బాస్ ఇస్తున్నాడు, మీరంతా ఆ బెడ్ మీదనే ఉండాలి, అలా చివరి వరకు ఎవరెవరు ఉంటారో, వాళ్ళు నామినేషన్ నుండి బయటపడినట్టు, మిగిలిన వాళ్ళు నామినేట్ అయ్యినట్టు అన్నమాట. దీనికి సంబంధించిన ప్రోమో ని కూడా మనం ఇందాకే చూసాము. కంటెస్టెంట్స్ ఒకరిని ఒకరు బయటకు నెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అందుతున్న సమాచారం ఏమిటంటే మహేష్ రాథోడ్,శ్రీజ, ఇమ్మానుయేల్ మరియు పవన్ కళ్యాణ్ తప్ప మిగిలిన అందరూ నామినేషన్స్ లో ఉన్నారట.
Also Read: ‘ఓజీ’ 11 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. బ్రేక్ ఈవెన్ అయ్యింది.. కానీ ట్విస్ట్ ఏమిటంటే!
భరణి కూడా నామినేషన్స్ లోకి వచ్చాడు కానీ, మహేష్ కెప్టెన్ అవ్వడం వల్ల, భరణి ని సేవ్ చేసి, తనూజ ని నామినేషన్స్ లోకి పంపినట్టు తెలుస్తుంది. ఈ విషయం లో తనూజ తో మహేష్ కి పెద్ద మాటల యుద్ధమే నడిచిందట. ప్రస్తుతానికి ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే, ఈ వారం దివ్య మరియు రీతూ చౌదరి డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. దివ్య గేమ్స్ బాగా ఆడుతున్నప్పటికీ, ఆమె వైల్డ్ కార్డు అవ్వడం తో సరైన ఫ్యాన్ బేస్ ఏర్పడలేదు. ఆ కారణం చేత ఆమె గత వారం డేంజర్ జోన్ లోకి వచ్చింది, ఈ వారం కూడా డేంజర్ జోన్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.ఇక రీతూ చౌదరి కి ప్రస్తుతం అందరికంటే తక్కువ ఓటింగ్ ఉంది. ఆమెతో పాటు దమ్ము శ్రీజ నామినేషన్స్ లోకి వచ్చునంటే రీతూ సేఫ్ జోన్ లోనే ఉండేది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.