Bigg Boss 9 Telugu TRP Rating: ప్రస్తుతం రియాల్టీ షోలకు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ లభిస్తోంది…టెలివిజన్ రంగంలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన ఏకైక షో ‘బిగ్ బాస్’…ఇప్పటికే 8 సీజన్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 9వ సీజన్ ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు… గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ లో భారీ మార్పులు చేశారు. సెలబ్రిటీస్ తో పాటు కామనర్స్ ని సైతం ఈ షోలో భాగం చేశారు. కానీ కామనర్స్ ఏం చేస్తున్నారో ప్రేక్షకులకు అర్థం కావడం లేదు. ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు… దీనివల్ల ఈ షో రేటింగ్ చాలా వరకు తగ్గిపోతోంది అంటూ కొంతమంది విమర్శకులు సైతం ఈ షో మీద కొన్ని కామెంట్స్ చేస్తున్నారు.
బిగ్ బాస్ సీజన్ 8 కి 16 నుంచి 18 వరకు రేటింగ్ వస్తే ఈ సీజన్ లో గడిచిన ఎపిసోడ్లను బట్టి చూస్తే 8 నుంచి 10 టిఆర్పి రేటింగ్ మాత్రమే వస్తోంది… దీనివల్ల ఈ సీజన్ దారణమైన ఫెయిల్యూర్ ను ఎదుర్కోబోతోంది అనే సంకేతాలు అందుతున్నాయి… ఈ సీజన్ లో సరైన కంటెస్టెంట్ రాలేదు. దానివల్ల ప్రతి ఎపిసోడ్ పెద్దగా ఇంట్రెస్టింగ్ గా అయితే ఉండడం లేదు…
ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ రావాలన్న, టీఆర్పీ రేటింగ్ భారీగా పెరగాలన్న బిగ్ బాస్ హౌజ్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మంచి కంటెస్టెంట్స్ ను పంపించాల్సిన అవసరమైతే ఉంది. ఇక వచ్చే కంటెస్టెంట్లు సైతం ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే విధంగా ఉండాలి. లేకపోతే మాత్రం వాళ్లు కూడా ఈ షో కి మైనస్ గా మారే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం కొంతమంది వైల్డ్ కార్డు ఎంట్రీ లో వస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నప్పటికి ఆ వచ్చేవారు ఎవరు అనేదానిమీద పూర్తి స్పష్టత రావడం లేదు… ఇక మీదట రాబోయే ఎపిసోడ్స్ తో పూర్తిస్థాయి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తే తప్ప ఈ సీజన్ సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ అంటూ విశ్లేషకులు సైతం షో యజమాన్యానికి సలహాలు ఇస్తున్నారు…