Bigg Boss 9 Telugu Top 5 Contestants : ప్రతీ బిగ్ బాస్ సీజన్ కి 10 వ వారంలోనే మనకి టాప్ 5 కంటెస్టెంట్స్ గా ఎవరెవరు ఉండబోతున్నారు అనేది స్పష్టంగా అర్థం అవ్వుద్ది. కానీ ఈసారి మాత్రం టాప్ 5 గా ఎవరు నిలబోతున్నారు అనేది స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. కానీ గతం వారం తో అయితే టాప్ 4 కంటెస్టెంట్స్ పేర్లు బలంగా ఫిక్స్ అయిపోయాయి. తనూజ, పవన్ కళ్యాణ్, ఇమ్మానుయేల్ మరియు డిమోన్ పవన్ లు తమ స్థానాలను పదిలం చేసుకున్నారు. నేటి ఎపిసోడ్ తో దివ్య ఎలిమినేట్ అయ్యింది. మిగిలిన కంటెస్టెంట్స్ భరణి, సంజన, సుమన్ శెట్టి మరియు రీతూ చౌదరి. ఈ వారం సుమన్ శెట్టి నామినేషన్స్ లోకి వస్తే కచ్చితంగా ఎలిమినేట్ అయిపోతాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ వారం కూడా ఆయన డేంజర్ జోన్ లోనే ఉన్నాడు.
కాబట్టి ఆయన నామినేషన్స్ లోకి వస్తే కచ్చితంగా వచ్చే వారం ఎలిమినేట్ అవుతాడు. ఇక మిగిలిన ముగ్గురిలో టాప్ 5 స్థానం కోసం చాలా గట్టి పోటీనే ఉంది. గత రెండు వారాల నుండి భరణి కి సంజన, రీతూ చౌదరి కంటే ఎక్కువ ఓటింగ్ ఉండేది. కానీ నిన్నటి ఎపిసోడ్ తో లెక్కలు మారాయి. సంజన ని నాగార్జున మరియు బిగ్ బాస్ టీం టార్గెట్ చేసి టార్చర్ చేసే ప్రయత్నం చేయడం, ఆమె తమ ఆత్మాభిమానం కోసం చేసిన పోరాటం ని చూసి ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. దీంతో ఆమె కచ్చితంగా టాప్ 5 లో ఉంటుందని అంటున్నారు. మరోపక్క భరణి ఏమి తక్కువ కాదండోయ్..వచ్చే వారం టికెట్ టు ఫినాలే లో అద్భుతమైన ఆట తీరు ని ప్రదర్శిస్తే, కచ్చితంగా ఈయన కూడా టాప్ 5 లో ఉంటాడు. వీళ్లిద్దరి మధ్య ఓటింగ్ తేడా నువ్వా నేనా అనే రేంజ్ లో ఉంది.
ఇక రీతూ చౌదరి విషయానికి వస్తే, ఈమెకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఇప్పటి వరకు ఏర్పడలేదు. తనూజ, డిమోన్ పవన్ నామినేషన్స్ లో లేకపోతేనే ఈమెకు మంచి ఓటింగ్ పడుద్ది. లేదంటే డేంజర్ జోన్ లో ఉంటుంది. వచ్చే వారం తనూజ, డిమోన్ పవన్ నామినేషన్స్ లోకి వస్తే ఈమె డేంజర్ జోన్ లో ఉండడం తథ్యం. ఒకవేళ వాళ్ళు లేకపోతే వచ్చే వారం ఓటింగ్ లో ఈమెనే టాప్ 1 స్థానం లో ఉంటుంది. కానీ ఈమెకు సొంత ఓటింగ్ చూస్తే భరణి, సంజన లకు దరిదాపుల్లో కూడా ఉండదు అనడం లో ఎలాంటి సందేహం లేదు. పైగా అనవసరంగా సంజన తో పెట్టుకొని చాలా పెద్ద తప్పు చేసింది. నిన్నటి ఎపిసోడ్ ఆమెకు మైనస్ అయ్యింది అనే చెప్పాలి. కాబట్టి వచ్చే టాప్ 5వ స్థానం లో భరణి/ సంజన ఉండే అవకాశాలుఉన్నాయి. ఒకవేళ ఈ సీజన్ లో టాప్ 6 ఉంటే భరణి, సంజన లను ఫినాలే వీక్ లో చూడొచ్చు.