Bigg Boss 9 Telugu Tanuja: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా పిలవబడే వారిలో ఒకరు భరణి. కచ్చితంగా దుమ్ము లేపేస్తాడు అని అంతా అనుకున్నారు. టాస్కులు ఆడాల్సి వచ్చినప్పుడు బాగానే ఆడుతున్నాడు కానీ, బంధాల్లో పడిపోయి పూర్తిగా తన గేమ్ ని నాశనం చేసుకుంటున్నాడు. ఎంతసేపు అవతల వాళ్లకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడమే తప్ప, ఆయన గేమ్ అసలు కనిపించడం లేదు. రోజురోజుకి ఆయన గ్రాఫ్ పడిపోతూ ఉండడం తో, బిగ్ బాస్ టీం భరణి ని ట్రాక్ లోకి తీసుకొచ్చే చివరి ప్రయత్నం నిన్నటి ఎపిసోడ్ లో చేశారు. ‘మీరు అసలు నచ్చట్లేదు..బాండింగ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి, మీ గేమ్ అసలు కనిపించడం లేదు, మిమ్మల్ని హౌస్ లో ఉంచాలని అనిపించడం లేదు’ అంటూ నిన్న ఆడియన్స్ లోని ఒక అమ్మాయితో చెప్పించాడు నాగార్జున. అయ్యో క్షమించు అమ్మా, ఇక నుండి మిమ్మల్ని నిరాశపర్చను అంటూ చెప్పుకొచ్చాడు భరణి.
అంతే కాకుండా తనూజ మీద తనకు ఉన్న అసంతృప్తి మొత్తాన్ని నిన్న బయటపెట్టే ప్రయత్నం చేసాడు భరణి. ఎన్నోసార్లు ఆమెకు సహాయం చేసాను, ఆమె తరుపున నిలబడ్డాను, కానీ అది గుర్తించడం లేదు, ఎంతసేపు నేను ఏమి చేయడం లేదనే అనుకుంటుంది అంటూ నాగార్జున ముందు చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా పవర్ అస్త్రా ని కూడా తనూజ కి అందకుండా చేసాడు భరణి. ఆమె చాలా ఎమోషనల్ అమ్మాయి, ప్రతీ దానికి ఓవర్ గా రియాక్ట్ అవుతుంది, సహాయం చేసిన వాళ్ళని గుర్తించదు, అలాంటి అమ్మాయి చేతుల్లోకి పవర్ అస్త్రా వెళ్లడం కరెక్ట్ కాదంటూ ఆమెకు దక్కకుండా చేసాడు. ఎప్పుడైతే దివ్య కి మాట ఇచ్చి, తనూజ ఆ మాట ని నిలబెట్టుకోలేదో, అప్పటి నుండే భరణి కి ఆమెపై నెగిటివ్ అభిప్రాయం ఏర్పడింది. నిన్నటితో బిగ్ బాస్ టీమ్ తనూజ, భరణి బంధానికి ముగింపు కార్డు వేసినట్టే అనుకోవాలి.
ఇంత చేసినప్పటికీ కూడా రేపు మళ్లీ వీళ్లిద్దరు కలిసిపోతే, ఇక వీళ్ళను ఎవ్వరూ మార్చలేరు అనుకోవచ్చు, కచ్చితంగా రాబోయే రోజుల్లో శ్రీజ ని ఎలా అయితే స్కీమ్స్ వేసి ఎలిమినేట్ చేసారో, భరణి ని కూడా అలాగే ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే ఆయన బాండింగ్స్ ఆడియన్స్ కి చాలా బోర్ కొట్టించేస్తున్నాయి. అదే విధంగా నిన్న తనూజ, పవన్ కళ్యాణ్ మధ్య కూడా బిగ్ బాస్ టీం పుల్లలు పెట్టే ప్రయత్నం చేసింది. తనూజ ని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి పవన్ కళ్యాణ్, డిమోన్ పవన్ మరియు భరణి కెప్టెన్సీ టాస్క్ లో ఆమెని మోసం చేసినట్టు చూపించారు. ఆడియన్స్ కి అయితే మోసం చేసినట్టు ఎక్కడా అనిపించలేదు. దీనిని తనూజ ఎలా తీసుకొని ముందుకు వెళ్తుందో రేపటి నుండి చూడాలి. మొత్తానికి తనూజ ని ఎమోషనల్ బాండింగ్స్ నుండి దూరం చేసి ఒంటరిని చేసే ప్రయత్నం చేశారు బిగ్ బాస్ టీం.