Bigg Boss 9 Telugu Tanuja And Bharani: ఈ బిగ్ బాస్ సీజన్(Bigg Boss 9 Telugu) లో చాలా క్యూట్ గా అనిపించిన బంధం తనూజ, భరణి లది. మొదటి వారం నుండి వీళ్ళ మధ్య నిజమైన తండ్రి, కూతురు బాండింగ్ ఉండేది. భరణి వైపు నుండి నిజమైన బంధం ఉంది కానీ, ఎందుకో ఆడియన్స్ కి తనూజ వైపు నుండి నిజమైన బంధం అని అనిపించడం లేదు. ఈమధ్య కాలం లో అయితే తనకు అవసరమైనప్పుడు నాన్న అని పిలుస్తోంది, మిగిలిన సమయాల్లో భరణి సార్ అని పిలుస్తోంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొదటి 5 వారాలు తనూజ వైపు నుండి కూడా నిజమైన బంధం కనిపించింది కానీ, రీ ఎంట్రీ తర్వాత మాత్రం కేవలం నటిస్తోంది అని అంటున్నారు. మొదటి 5 వారాలు భరణి చాలా బలమైన కంటెస్టెంట్ అనే అభిప్రాయం హౌస్ మేట్స్ అందరికీ ఉండేది.
అంతే కాకుండా ఒక టీం లీడర్ లాగా అందరికీ సపోర్టుగా నిలుస్తూ తోడు గా ఉండేవాడు. టాస్కులు ఇచ్చినా బలంగా ఆడేవాడు. రీ ఎంట్రీ తర్వాత భరణి కి గొప్ప ఓటు బ్యాంకు లేదని హౌస్ మేట్స్ అందరిలో ఒక అభిప్రాయం కలిగింది. పైగా వచ్చిన మొదటి రోజే ఆయనకు తీవ్రమైన గాయాలు అవ్వడం వల్ల గేమ్స్ అంతకు ముందు లాగా ఆడలేడు కాబట్టి ఇతని అవసరం మనకి లేదు అనే ఫీలింగ్ బహుశా తనూజ కి కూడా కలిగిందేమో, అందుకే రీ ఎంట్రీ తర్వాత పట్టించుకోవడం లేదంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఆయన డేంజర్ జోన్ లో ఉన్నప్పుడు సేవింగ్ పవర్ ని నాకోసం ఉపయోగిస్తావా అని నోరు తెరిచి అడిగినా కూడా, ఆలోచిస్తా అని సమాధానం చెప్పిందో, అప్పటి నుండే ఆడియన్స్ లో తనూజ పై నెగటివ్ ఫీలింగ్, భరణి పై పాజిటివ్ ఫీలింగ్ ఏర్పడడం మొదలైంది.
గత రెండు మూడు రోజుల నుండి తనూజ మళ్లీ భరణి కి క్లోజ్ అయ్యింది. మొన్నటి ఎపిసోడ్ లో మీరు ఈ వారం కచ్చితంగా కెప్టెన్ అవ్వాలి, నా ఫోటో పక్కన మీ ఫోటో చూడాలి అని పెద్ద పెద్ద డైలాగ్స్ విసిరింది. కానీ తీరా చూస్తే ఆమె భరణి కి సపోర్ట్ చేయలేదు. వివరాల్లోకి వెళ్తే నేడు హౌస్ మేట్స్ అందరికీ కెప్టెన్సీ టాస్క్ ని నిర్వహించారు. ఈ టాస్క్ ఆడడం కోసం రెండు గ్రూప్స్ గా మీలో మీరు మాట్లాడుకొని డివైడ్ అవ్వండి అని బిగ్ బాస్ అంటాడు. తనూజ, కళ్యాణ్, పవన్, రీతూ చౌదరి, సుమన్ శెట్టి ఒక టీం గా ఏర్పడగా, భరణి, ఇమ్మానుయేల్, సంజన మరియు దివ్య ఇంకో టీం గా ఏర్పడ్డారు. తనూజ కి నిజంగా సపోర్టు చేయాలనీ ఉండుంటే కచ్చితంగా భరణి టీం లో ఉండేది. కానీ ఆమె రీతూ కి సపోర్ట్ గా నిలిచి, ఆమె కోసం టీం మొత్తాన్ని ఏర్పాటు చేసి, చివరికి భరణి కి సపోర్టుగా ఉండే సుమన్ శెట్టి ని కూడా లాగేసింది. దీన్ని చూసి మరోసారి కూతురు తండ్రికి వెన్నుపోటు పొడిచింది అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు. అసలు ఏమి జరిగింది అనేది తెలియాలంటే రాత్రి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.