Bigg Boss 9 Telugu : గత బిగ్ బాస్ సీజన్స్ లో కొంతమంది కంటెస్టెంట్స్ హోస్ట్ నాగార్జున చెప్పే మాటలు విని తమను తాము ఎంతో మార్చుకున్నారు, టాప్ 5 వరకు వెళ్లారు కూడా. ఈ సీజన్ లో కూడా హోస్ట్ నాగార్జున కొంతమంది కంటెస్టెంట్స్ కి ఎన్నో సూచనలు ఇచ్చారు. మాస్క్ మ్యాన్ వంటి వాళ్ళు తమ తీరుని మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ శ్రీజ,ప్రియ లకు మాత్రం అసలు మారే ఉద్దేశ్యమే లేదు అన్నట్టు అనిపిస్తుంది. ప్రియ అయిన భవిష్యత్తులో మారుతుందేమో కానీ, శ్రీజ మాత్రం అసలు మారే సూచనలే కనిపించడం లేదు. ఈమెకు నాగార్జున అంటే గౌరవం కూడా లేదని నిన్నటి ఎపిసోడ్ తో స్పష్టంగా అర్థం అయిపోయింది. ఆయన పదే పదే మాట్లాడొద్దు అని చెప్తున్నా కూడా మధ్యలో కలగచేసుకొని మాట్లాడడం వంటివి చాలానే చేసింది నిన్న.
ప్రతీ విషయం లో దూరడం, కౌంటర్ వేయించుకొని కూర్చోవడం, నిన్న మొత్తం ఇదే జరిగింది. డిమోన్ పవన్ తన కెప్టెన్సీ ని తానే వదిలేసాడు. ఎందుకంటే గేమ్ న్యాయంగా జరగలేదు అని ఆయన ఫీల్ అయ్యాడు కాబట్టి. కానీ శ్రీజ పైకి లేచి, నాగార్జున తో మాట్లాడుతూ సార్ సంచాలక్ చేసిన తప్పుకి డిమోన్ ని తొలగించడం ఎందుకు సార్ అని అంటుంది. అప్పుడు నాగార్జున స్వయంగా డిమోన్ నే నాకు కెప్టెన్ పదవి వద్దు, నేను న్యాయంగా ఆడి గెలుచుకుంటాడు అన్నాడు, అర్థమైందా?, ప్రతీ దాంట్లో ఊరికే దూరకు అంటూ శ్రీజ కి ఫట్ ఫట్ అని కౌంటర్. దెబ్బతో సైలెంట్ గా కూర్చుంది. వీళ్ళని తిడుతుంటే అవతల పక్కన ఆడియన్స్ ని ఒక రేంజ్ లో చప్పట్లు, ఈలలు వస్తున్నాయి. దీనిని చూసి కూడా వీళ్ళు జనాల్లో తమపై ఉన్న నెగిటివిటీ ని గుర్తించి మారుతారేమో అనుకుంటున్నారు విశ్లేషకులు.
కానీ వీళ్ళు మారే సమస్యనే లేదని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అనుకుంటున్నారు. ఎందుకంటే నాగార్జున ముందు వీళ్ళు చూపించిన బలుపు అలాంటిది. ముఖ్యంగా ప్రియ కి తాము చేసిన తప్పు ఏంటో బాగా తెలుసు. అయినప్పటికీ కూడా నాగార్జున ముందు నోరేసుకొని మాట్లాడింది. చివరికి భరణి విషయం లో మనీష్ చేసిన తప్పు గురించి, సంచాలక్ గా ఆమె చేసిన తప్పుల గురించి వీడియోలు వేసి మరీ చూపిస్తే అవును సార్, తప్పే అని ఒప్పుకుంది. ఇదంతా ముందే తెలిసినప్పుడు ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేయడం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుతున్నారు. తీరు మార్చుకోకపోతే ఇదే ప్రియ కి ఆఖరి వారం అని అంటున్నారు. పెద్ద పెద్ద స్టార్ సెలబ్రిటీలే నాగార్జున ముందు ఎంతో వినయం గా ఉంటారు. కానీ ఈ శ్రీజ, ప్రియ లను ఎక్కడి నుండి పట్టుకొచ్చారు ఇలా ఉన్నారు అంటూ నెటిజెన్స్ ఫుల్ ఫైర్ మీద ఉన్నారు.