Bigg Boss 9 Telugu Sreeja Re Entry: బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) తెలుగు హిస్టరీ చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా సరికొత్త ప్రయోగం ఈ సీజన్ లో చేశారు. గతం లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ నుండి ఒకరు, లేదా ఇద్దరిని హౌస్ మేట్స్ ఓటింగ్ ద్వారా లోపలకు పంపేవారు. కానీ ఈసారి మాత్రం మొదటి వారం నుండి ఆరవ వారం వరకు ఎలిమినేట్ అయిన 7 మంది కంటెస్టెంట్స్ శనివారం రోజున రాత్రి ఒకరి తర్వాత ఒకరు ఎంట్రీ ఇచ్చారు. శ్రేష్టి వర్మ వస్తుందో లేదో అనుకున్నారు కానీ, చివరి నిమిషం లో ఆమె కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ సీజన్ లో ఆడియన్స్ అన్యాయమైన ఎలిమినేషన్ గా భావించింది శ్రీజ విషయం లోనే. ఎందుకంటే ఆమెని ఆడియన్స్ ఓటింగ్ ద్వారా కాకుండా, హౌస్ లోకి అడుగుపెట్టిన వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ చేసి పంపారు. బిగ్ బాస్ హిస్టరీ లో ఎప్పుడూ ఇలా జరగలేదు.
Also Read: 2026 లో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వనున్న మెగాస్టార్..చరిత్రలో ఇదే తొలిసారి!
అందుకే ఆమె రీ ఎంట్రీ కోసం సోషల్ మీడియా లో పెద్ద యుద్ధమే జరిగింది. శ్రీజ రీ ఎంట్రీ ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున స్టార్ మా ఛానల్ ని ట్యాగ్ చేసి ట్రెండ్ చేశారు. ఆడియన్స్ లో ఉన్న నెగిటివిటీ ని బిగ్ బాస్ టీం గమనించింది. పైగా హౌస్ లో ఫైర్ మొత్తం తగ్గిపోయింది. గత వారం టీఆర్ఫీ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. ఎలాగో శ్రీజ తో రీ ఎంట్రీ చేయించాలని బిగ్ బాస్ టీం ఫిక్స్ అయ్యింది. ఒక్క శ్రీజ ని మాత్రమే ఎందుకు?, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరినీ లోపలకు పంపు, అవుట్ హౌస్ లో వాళ్ళను ఉంచి, వాళ్లకు మరియు హౌస్ లో ఉన్న ప్రస్తుత కంటెస్టెంట్స్ మధ్య యుద్ధం లాగా క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేసి ఈ నిర్ణయం తీసుకున్నారు.
శ్రీజ వచ్చిన తర్వాత హౌస్ లో కావాల్సిన ఫైర్ అయితే వచ్చింది. ప్రస్తుతం హౌస్ లో నామినేషన్స్ జరుగుతున్నాయి. శ్రీజ మాధురి ని నామినేట్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. మాధురి హౌస్ లోకి అడుగుపెట్టిన రోజే శ్రీజ తో గొడవపడే ప్రయత్నం చేసింది. కేవలం పేరు అడిగినందుకు ఆమె చూపించిన యాటిట్యూడ్ అంతా ఇంతా కాదు. ఆ వారం శ్రీజ ఎలిమినేట్ అవ్వకుండా హౌస్ లోనే ఉండుంటే, కచ్చితంగా మాధురి ని నామినేట్ చేసేది. కానీ అప్పుడు ఛాన్స్ రాలేదు, ఇప్పుడు ఛాన్స్ వచ్చింది కాబట్టి ఉపయోగించుకుంది. పైగా మాధురి హౌస్ లోకి వచ్చిన రెండు వారాల్లో ఎన్నో గొడవలు పెట్టుకుంది. ఆమె యాటిట్యూడ్ ని నిన్న గాక మొన్న కూడా చూపించింది. బోలెడన్ని పాయింట్స్ ఆమె మీద ఉన్నాయి కాబట్టి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మాధురి ని నామినేట్ చేసింది. చూడాలి మరి రేపు వీళ్లిద్దరి మధ్య ఏ రేంజ్ ఫైటింగ్ జరిగింది అనేది.